+91 99635 77856

రాహుల్ గాంధీ మీద ఈగ వాలిన చూస్తూ ఊరుకోం

-రాహుల్ గాంధీని తీవ్రవాదిగా చిత్రీకరించడం హేయనీయం…
-బిజెపి నాయకులు గాడ్సే విధానాలను ఆలంబిస్తున్నారు…
-హుజరాబాద్ లో కూడా కేసు పెట్టండి…
-టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్…
హుజురాబాద్/సెప్టెంబర్18(మా అక్షరం): లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై ఈగ వాలిన ఊరుకోమని టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. బుధవారం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు.

బిజెపి పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ ని తీవ్రవాదిగా చిత్రీకరిస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. హుజురాబాద్ లో కూడా రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు పెట్టాలని నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ కు సూచించారు.గాంధీ కుటుంబంలో పుట్టిన వ్యక్తి రాహుల్ గాంధీ,నెహ్రూ వేసిన బాటలో నేడు దేశం అభివృద్ధిలో ముందుకు పోతుందని అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ వచ్చిందని, బీజేపీకి అక్కసు ఉందన్నారు. తీవ్రవాద చేతుల్లో కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రధాని ఏందుకు స్పందించడం లేదు.గాడ్సే విధానాన్ని మోడీ పాటిస్తున్నారని అన్నారు. బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రాహుల్ గాంధీ మీద ఈగ వాలిన ఊరుకునేది లేదు.మతాన్ని అడ్డుపెట్టుకొని మోడీ ప్రధాని అయ్యారని అన్నారు.యావత్ భారతదేశం ఇప్పుడు రాహుల్ గాంధీ వైపు చూస్తుందని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దేశం లో అధికారంలోకి వస్తుందన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపికి 100 సీట్లు కూడా రావని ఆయన అన్నారు.

తుమ్మేటి సమ్మిరెడ్డి మరణం పార్టీకి తీరని లోటు

తుమ్మేటి సమ్మిరెడ్డి ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటని, మంచి మిత్రున్ని కోల్పోయనని, ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. వ్యక్తిగతంగా సమ్మిరెడ్డి చాలా దగ్గర అని, ఇద్దరం ఎన్.ఎస్.యూఐ కార్యకలాపాల్లో పాల్గొన్నామని, గాంధీ భవన్ లో మీడియా ఇంచార్జిగా మరల అవకాశం ఇచ్చే సమయంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు , హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్,యస్సి సెల్ మాజీ చైర్మన్ ఆరపెల్లి మోహన్,గూడెపు భాస్కర్ రెడ్డి, టిపిసిసి సభ్యులు పత్తి క్రిష్ణారెడ్డి,బొమ్మ శ్రీరాం చక్రవర్తి, హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్,టి పిసిసి యస్సి సెల్ డిపార్ట్మెంట్ చెర్మన్ తిప్పారపు సంపత్, పిసిసి నాయకుడు ఆవేలీ దామోదర్ రావు,హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు, హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు లంకదాసరి లావణ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోల్లు బాబు, హుజురాబాద్ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు యేముల పుష్పలత, జమ్మికుంట పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు పూదరి శివ-రేణుకా, సాయిని రవి, ఎం శ్రీనివాస్, కాజీపేట శ్రీనివాస్, ఖలీద్ హుస్సేన్,యు శ్రీనివాస్ పటేల్, ఇ.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !