+91 99635 77856

ఎమ్మెల్సీ ఎన్నికల్లో శేఖర్ రావుకు ట్రస్మా నాయకుల మద్దతు…

హుజురాబాద్/సెప్టెంబర్ 19(మా అక్షరం):త్వరలో జరగబోయే కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వాల్మీకి విద్యాసంస్థల అధిపతి యాదగిరి శేఖర్ రావుకు ట్రస్మా నాయకులు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న యాదగిరి శేఖర్ రావును ట్రస్మా నాయకులు కలిశారు.అనంతరం వారు మాట్లాడుతూ…. యాదగిరి శేఖర్ రావు ఉమ్మడి కరీంనగర్ జిల్లా తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రైవేటు విద్యాసంస్థల ప్రయోజనాల కోసం అలుపెరుగని పోరాటం చేశాడని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలను వేధిస్తున్న ప్రభుత్వ అధికారుల నుండి కాపాడడం కోసం ప్రభుత్వంతో పోరాటం చేశాడని అన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ ఆర్థిక సంక్షోభంలో ఉండగా అందులో పని చేస్తున్న లక్షలాది ఉపాధ్యాయులకు ఉపాధి లేక కూరగాయలు అమ్మడం ఇతర వృత్తులు చేస్తూ పొట్ట పోసుకుంటున్న పరిస్థితులను చూసి అప్పుడున్న సీఎం కేసీఆర్ కు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల దయనీయమైన స్థితిని తెలియజేసి వారికి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలకు 2000 రూపాయలు 25 కిలోల సన్న బియ్యం ఇప్పించాడని అన్నారు.కరోనా సమయంలో చిన్నపాటి సహాయం కూడా ఇతరులు చేయలేని పరిస్థితిలో ఉన్న సమయంలో ప్రభుత్వంతో మాట్లాడి ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఆయాలు అటెండర్లు డ్రైవర్లకు ఇవి లభించాయని వారన్నారు. ఇంతే కాకుండా ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు హెల్త్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారని అన్నారు.రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు తమ గొంతు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉండగా కేవలం ప్రైవేటు రంగంలో పని చేసే వారి సమస్యలు ప్రస్తావించేవారు శాసనమండలిలో ఇప్పటివరకు లేరని యాదగిరి శేఖర్ రావును పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో పని చేసే చిరు ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని ప్రైవేటు విద్యాసంస్థలు అందులో పని చేసే ఉద్యోగులు ఉపాధ్యాయులు డ్రైవర్లు ఆయాలు యాదగిరి శేఖర్ రావుకు తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల యజమానులకు అందులో పని చేసే ఉపాధ్యాయుల ప్రయోజనం కోసం పోరాటం చేసిన యాదగిరి శేఖర్ రావు కోసం ట్రస్మా పాఠశాలలన్నీ బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర నాయకులు సుంకిశాల సంతోష్ రావు జిల్లా నాయకులు హుజురాబాద్ అధ్యక్షులు వి.వెంకటేశ్వర్లు, కార్యదర్శి పి.రవీందర్ రెడ్డి, కోశాధికారి దాసరి కోటేశ్వర్ యాదవ్,మాజీ అధ్యక్షులు బద్దుల రాజ్ కుమార్ యాదవ్, సంపత్ రావు, జిల్లా నాయకులు మాడిశెట్టి ప్రసాద్, పాడి విజయపాల్ రెడ్డి, ఏనుగు మహిపాల్ రెడ్డి, మంచికట్ల గోపాల్, పి.సతీష్,రవీందర్, విన్సెంట్, వెంగళరావు, కిరణ్ కుమార్, తిరుపతి యాదవ్, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !