+91 99635 77856

ప్రజా సమస్యలపై పోరాటానికి బీఆర్ఎస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది

Kudikala Sai Editor
maaksharamnews.in

ప్రజా సమస్యలపై పోరాటానికి బీఆర్ఎస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటా...
-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి...

హుజురాబాద్/సెప్టెంబర్ 24 (మా అక్షరం): నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి ఆపద ఎదురైన, వారి సమస్యల కోసం ఏ పోరాటైనకైనా బీఆర్ఎస్ పార్టీతోపాటు తాను కూడా సిద్ధంగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం జమ్మికుంట అర్బన్ జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కారణాలు వల్ల అనారోగ్యంతో చికిత్స పొందిన బాదిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా బాధితులకు కొంత ఆర్థిక భరోసాగా ఉంటుందని, బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యేగా తాను ఎప్పుడు అండగా ఉంటానని అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాకుండా అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైనా ఎలాంటి రోగానికైనా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించేలా ప్రభుత్వం మార్పులు చేయాలని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా ఎల్లప్పుడు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వయంగా గడపగడపకు తిరుగుతూ చెక్కులు పంపిణీ చేసి, వారి ఆరోగ్య పరిస్థితిలో అడిగి తెలుసుకున్నారు. జమ్మికుంట అర్బన్ లో 43 కుటుంబాలకు 12,26,500 విలువ గల చెక్కులతో పాటు జమ్మికుంట రూరల్ లో 45 కుటుంబాలకు 10 లక్షల 70000 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

వర్షంలో ఆగని చెక్కుల పంపిణీ....

చెక్కుల పంపిణీలో భాగంగా గడపగడపకు తిరుగుతూ చెక్కులు పంపిణీ చేస్తున్న తరుణంలో హఠాత్తుగా వర్షం మొదలైంది. ఒకవైపు జోరుగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ప్రజలకు చెక్కుల పంపిణీ చేయాలని దృఢ నిశ్చయంతో వర్షంలోనూ ఇంటింటికి తిరిగి చెక్కుల పంపిణీ చేశారు. వర్షంలోనూ చెక్కుల పంపిణీ చేయడం చూసిన ప్రజలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ని లీడర్ అంటే ఇలా ఉండాలంటూ అభినందించారు.

Share ePaper Clip

Preparing image...

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా…
-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…

హుజురాబాద్/సెప్టెంబర్ 24 (మా అక్షరం): నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి ఆపద ఎదురైన, వారి సమస్యల కోసం ఏ పోరాటైనకైనా బీఆర్ఎస్ పార్టీతోపాటు తాను కూడా సిద్ధంగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం జమ్మికుంట అర్బన్ జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కారణాలు వల్ల అనారోగ్యంతో చికిత్స పొందిన బాదిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా బాధితులకు కొంత ఆర్థిక భరోసాగా ఉంటుందని, బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యేగా తాను ఎప్పుడు అండగా ఉంటానని అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాకుండా అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైనా ఎలాంటి రోగానికైనా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించేలా ప్రభుత్వం మార్పులు చేయాలని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా ఎల్లప్పుడు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వయంగా గడపగడపకు తిరుగుతూ చెక్కులు పంపిణీ చేసి, వారి ఆరోగ్య పరిస్థితిలో అడిగి తెలుసుకున్నారు. జమ్మికుంట అర్బన్ లో 43 కుటుంబాలకు 12,26,500 విలువ గల చెక్కులతో పాటు జమ్మికుంట రూరల్ లో 45 కుటుంబాలకు 10 లక్షల 70000 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

వర్షంలో ఆగని చెక్కుల పంపిణీ….

చెక్కుల పంపిణీలో భాగంగా గడపగడపకు తిరుగుతూ చెక్కులు పంపిణీ చేస్తున్న తరుణంలో హఠాత్తుగా వర్షం మొదలైంది. ఒకవైపు జోరుగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ప్రజలకు చెక్కుల పంపిణీ చేయాలని దృఢ నిశ్చయంతో వర్షంలోనూ ఇంటింటికి తిరిగి చెక్కుల పంపిణీ చేశారు. వర్షంలోనూ చెక్కుల పంపిణీ చేయడం చూసిన ప్రజలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ని లీడర్ అంటే ఇలా ఉండాలంటూ అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !