– సరికొత్త రాజకీయానికి తెర తీసిన సబ్బని వెంకట్
– విద్య, వైద్యం, ఉపాధితో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్న సామాజికవేత్త…
– నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సబ్బని వెంకట్…
హుజురాబాద్/అక్టోబర్ 11 (మా అక్షరం): నియోజకవర్గ పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా వినూత్న ఒరవడితో కూడిన సరికొత్త రాజకీయం సాగుతోంది. ఈ తరహా నిజమైన అభివృద్ధి రాజకీయానికి ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ కంపెనీ “జెన్ పాక్ట్” గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ తెర తీశారు. ప్రజలకు మౌలికంగా అవసరమైన విద్య, వైద్యం తో పాటు ఉపాధి కల్పనకు అడుగులు పడాలని ఓవైపు డిమాండ్ చేస్తూనే.. మరోవైపున తన శక్తి మేరకు సమాంతర ప్రభుత్వాన్ని ఆయన నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే సందేశాన్ని అందిస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీ మాజీ క్రికెట్ కోచ్ దివంగత లవన్ కుమార్ స్మారకార్థం హుజురాబాద్ పట్టణ ప్రభుత్వ హైస్కూల్లో క్రికెట్ ట్రోఫీని నిర్వహించి.. విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సబ్బని వెంకట్ మాట్లాడిన మాటలు నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
“నా తమ్ముళ్ల జోలికొస్తే ఊరుకోను.”
హుజరాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ లో సబ్బని వెంకట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగా, ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలను ఆర్గనైజర్లు ఏర్పాటు చేయాగా.. వాటిని కొందరు చించి వేయడం పట్ల సబ్బని వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మృదుస్వభావి, అజాతశత్రువుగా కనిపించే వెంకట్.. తన అనుచరులు తమ్ముళ్ల జోలికి వస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. ఫ్లెక్సీలు చించి వేస్తే ఆవేశ పడాల్సిన అవసరం లేదని .. ఆ ఆవేశాన్ని సరైన సమయం, సందర్భంలో వాడాలని సూచిస్తూ వెంకట్ తన అనుచరులకు దిశా నిర్దేశం చేయడం కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే యువతలో క్రీడా స్ఫూర్తి పెంచడంతోపాటు క్రీడల పట్ల ఆసక్తి కలిగించేందుకు వెంకట్ ప్రయత్నించగా.. ఫ్లెక్సీలను చించి వేయడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు ఉన్నప్పటికీ సమాజ సేవలో ముందుంటూ.. ముఖ్యంగా యువతకు దిశా నిర్దేశం చేసే విధంగా సబ్బని వెంకట్ తన సొంత డబ్బులతో సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు క్రికెట్ ట్రోఫీ నిర్వహిస్తుంటే.. గిట్టని కొందరు అసూయతో ఫ్లెక్సీలను చించి వేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
సబ్బని మార్క్ పాలిటిక్స్
హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో యువత ప్రజలకు అండగా నిలిచేందుకు పిలుపు దూరంలోనే అందుబాటులో ఉంటున్నారు. హుజురాబాద్ పట్టణ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులైన చిరు వ్యాపారస్తులకు అందరికంటే ముందే సాయాన్ని ప్రకటించి.. స్థానిక నాయకత్వం సైతం సాయం చేసేలా చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు సబ్బని వెంకట్ శుక్రవారం ఒక ప్రకటనలో దసరా శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్టు వెల్లడించారు.











