+91 99635 77856

తల్లిదండ్రులకు ఘనంగా షష్టిపూర్తి నిర్వహించిన తనయులు

పలువురి అభినందనలు…
హుజురాబాద్/అక్టోబర్ 26(మా అక్షరం): కోట్లు సంపాదించిన తల్లిదండ్రులను సైతం అనాధ ఆశ్రమాల్లోకి పంపిస్తున్న ఈ రోజుల్లో ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఇద్దరు పిల్లలు తమ తల్లిదండ్రులకు ఘనంగా షష్టిపూర్తి నిర్వహించి పలువురికి ఆదర్శం గానిలిచారు. వివరాల్లోకెళ్తే హుజురాబాద్ లో నివాసముంటున్న శివనాధుని వెంకటేశ్వర్లు లక్ష్మీలకు రాజేష్, భరత్ ఇద్దరు కుమారులు జ్యోత్స్న ఒక కుమార్తెలు ఉన్నారు.వెంకటేశ్వర్లు చిరు వ్యాపారం చేసి పిల్లలను పెంచి పెద్ద చేసి వివాహం చేశారు.రాజేష్, భరత్ ఇద్దరు కుమారులు పెద్ద ఉద్యోగాలు చేయలేకపోయినా చిరు వ్యాపారాలు చేస్తూ జీవన కొనసాగిస్తున్నారు.తమను అల్లారు ముద్దుగా పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకు షష్టి పూర్తి చేసి తమ ప్రేమను చూపించారు.ముగ్గురు పిల్లల ప్రేమతో తమ తల్లిదండ్రులకు మూడు రోజులుగా హోమం తో పాటు వివిధ కార్యక్రమాలు చేస్తూ చివరి రోజు షష్టిపూర్తి నిర్వహించినందుకు తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోయారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కోడళ్లు రసజ్ఞ,అనుషల సహకారం గొప్పగా ఉందన్నారు.తల్లిదండ్రులకు కొడుకులు మూడు రోజులపాటు షష్టిపూర్తి నిర్వహించడంపై పలువురు అభినందనలు తెలుపుతున్నారు.కొడుకులంటే మీలా ఉండాలంటూ ఆశీస్సులు అందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !