-జిల్లా కలెక్టర్- పమేలా సత్పతి…
హుజురాబాద్/ అక్టోబర్15 (మా అక్షరం): విద్యార్థులు ఆరోగ్యంగా ఎదగడానికి పరిశుభ్రంగా ఉండాలని, చేతుల శుభ్రత వల్ల చాలా వ్యాధులను అరికట్టవచ్చని, అందుకే అందరూ వ్యక్తిగత శుభ్రత పాటించి,ఆరోగ్యంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో చేల్పూర్ లో యూనిసెఫ్ ఏర్పాటు చేసిన గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమంలో మంగళవారం కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…విద్యార్థులు క్రమశిక్షణతో పాటు తనకు ప్రభుత్వం అందజేసిన యూనిఫాం, షూస్ ధరించి,సమయానికి పాఠశాలకు హాజరుకావాలని సూచించారు. “పీఎం శ్రీ” క్రింద ఎంపికైన ఈ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని దానికి తోడు మంచి నాణ్యమైన విద్య క్రమశిక్షణ మనోధైర్యాన్ని ఇస్తూ, కార్పోరేట్ స్కూల్ పిల్లలకు దీటుగా ఎదగడానికి అవకాశం ఉందని ఉద్ఘటించారు.విద్య ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చని అందుకే మంచి విద్య క్రమశిక్షణ అవసరమని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రమేష్,యూనిసెఫ్ రాష్ట్ర ప్రతినిధులు కాశీనాథ్,ఫణీంద్ర,ఎమ్మార్వో కనకయ్య,ఎంపీడీవో హెచ్ఎం యూనిసెఫ్ జిల్లా సమన్వయకర్త కిషన్ స్వామి, ఎం పి ఓ సతీష్, ఎస్ బి ఎం రమేష్, వేణు ఏపిఎం తిరుపతి, పిఎస్ నాగరాజు,సి ఎఫ్ లు కళ్యాణి,రవీందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.











