+91 99635 77856

ఈ నెల 20న అలాయ్-బలాయ్ విజయవంతం చేయాలి

-మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్…
కరీంనగర్/ తిమ్మాపూర్అక్టోబర్18  (మాఅక్షరం):మానకొండూర్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నియోజకవర్గంలో ఈనెల 20వ తేదీ ఆదివారం నిర్వహించే అలైబలై కార్యక్రమానికై నాయకులతో చర్చించిన అనంతరం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముందుగా రైతుల సమస్యలను ఉద్దేశించి మాట్లాడుతూ….అకాల వర్షాలతో రైతులకు తీవ్ర పంట నష్టం వాటిలిందని, వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే చాలాచోట్ల ఇప్పటికీ వడ్ల కొనుగోలు ప్రారంభించలేదని స్థానిక ఎమ్మెల్యే తాను వచ్చేవరకు వడ్ల కొనుగోలు చేయవద్దని హూకుం జారీ చేస్తున్నాడని దీన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.తమ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని, రైతులకు మౌలిక వసతులు కల్పించి వెంటనే డబ్బులు వచ్చే విధంగా ఏర్పాటు చేశామని కానీ ప్రస్తుత ప్రభుత్వం తమ పార్టీ వాళ్లు కారనే అక్కసుతో సొసైటీ చైర్మన్ లను బెదిరిస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.మద్దతు ధర గతంలో ఉన్నదేనని కొత్తగా పెంచింది లేదని వడ్ల కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారుల వద్ద వడ్లను అమ్ముకుంటున్నారని “ఓడదాటేదాకా ఓడ మల్లప్ప -ఓడదాటినంక బోడ మల్లప్ప” అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ ఇవ్వమంటున్నారని కొనుగోలు కేంద్రాలకు రైతులు సన్న వడ్లు అమ్మే పరిస్థితి లేదని సన్నవడ్ల ప్రస్తావన ఎక్కడ లేదు కాబట్టి రైతులు తమను అడగాలని కోరుతున్నారని కాబట్టి ఏ వడ్ల కైనా 500 బోనస్ ఇవ్వాలని తమ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే రైతులపై రాజకీయం చేయడం పక్కనపెట్టి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులు రోడ్డెక్కకముందే రైతు సమస్యలు పరిష్కరించాలని కోరారు. నియోజకవర్గంలో దసరా పండుగ తరువాత నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ అలైబలై కార్యక్రమాన్ని ఈనెల 20 ఆదివారం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ వినోద్ కుమార్, పాడి కౌశిక్ రెడ్డి మాజీ మంత్రి గంగుల కమలాకర్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్కొంటున్నారని కావున నియోజకవర్గంలోని 6 మండలాల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు తప్పకుండా హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు స్థానిక జడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఇల్లంతకుంట మండల జడ్పిటిసి సిద్ధం వేణు, తిమ్మాపూర్ ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి,వివిధ మండలాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వివిధ గ్రామాల బి ఆర్ ఎస్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !