+91 99635 77856

ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడమే ప్రతిపక్షం బాధ్యత.

– బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
– మానకొండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం అలయ్ బలయ్ కార్యక్రమం.
– ఆరు గ్యారెంటీల బాధ్యత నాది అని చెప్పిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎక్కడున్నారు.
కరీంనగర్/తిమ్మాపూర్ అక్టోబర్20(మాఅక్షరం): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపెల్లి గ్రామంలోని సాయిరాం గార్డెన్స్ లో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావుల ఆధ్వర్యంలో మానకొండూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ ‘అలయ్-బలయ్’ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ లు హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మరోసారి రైతులను, ప్రజలను అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ మీద పోరాటానికి భిఆర్ఎస్ కుటుంబ సభ్యులు సిద్ధం కావా లని కోరారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి పది నెలలు కావస్తున్న ఏ ఒక్కటి కూడ సరిగా అమలు చేయలేదన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు, రైతు రుణ మాఫీ, రైతు భరోసా, పింఛన్లు, రైతులకు బోనస్, తులం బంగారం, విద్యార్థులకు జాబ్స్, మహిళలకు 2500 రూ వంటి అనేక పథకాలలో ప్రజలను నమ్మించి దగా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను దగా చేస్తూన్న మన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాదు..ఎగవేతల రేవంత్ రెడ్డి అని, చీఫ్ మినిస్టర్ కాదు, చీటింగ్ మ్యాన్…అని ఎద్దేవా చేశారు. ఉద్యోగాల కోసం అడిగితే కిరాతకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, జీవో 29 రద్దు చేయాలంటే ఎందుకు చేయడం లేదు, రాజ్యాంగం ప్రకారం రావాల్సిన అవకాశాలను ఎందుకు అడ్డుకుంటున్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులకు రాజ్యంగా ఫలాలు దక్కకూడదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ వికృత వైఖరి పట్ల గ్రామ, గ్రామా న చర్చలు పెట్టి, రైతులు, యువత అందరికీ అర్థమయ్యేలా వివరించాలి అంటూ పార్టీ శ్రేణులకు సూచించారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా మానకొండూరు నియోజకవర్గంలో మళ్లీ బీఆర్ఎస్ వాళ్లే గెలుస్తారు అని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ తిమ్మాపూర్ మండల అధ్యక్షులు రావుల రమేష్, లతో పాటు మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !