కరీంనగర్, తిమ్మాపూర్ అక్టోబర్ 20(మాఅక్షరం):తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో ఇటీవల పలు కారణాలతో మరణించిన బత్తిని సాయి, ఏనుగుల ఐలయ్య కుటుంబాలను మన ముదిరాజ్ యువసేన యూత్ నాయకులు పరామర్శించి ఆ కుటుంబాలకు 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ముదిరాజ్ యువసేన యూత్ అధ్యక్షుడు మామిడి శ్రీనివాస్ మట్లాడుతూ…. మల్లాపూర్ గ్రామంలో ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని రానున్న రోజుల్లో ముదిరాజులకనే కాకుండా కులమతాలకు అతీతంగా ఆపదలో ఉన్న పేదవారికి అండగా ఉండి సహయ సహకారాలు అందిస్తూ గ్రామంలో సేవా కార్యక్రమాలు చేయడానికి ముదిరాజ్ యువసేన యూత్ ముందుంటుందని యువసేన యూత్ అధ్యక్షులు మామిడి శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యువసేన యూత్ డైరెక్టర్లు గాండ్ల కుమారస్వామి, పల్లె సాయి మారుతి, సంఘ సభ్యులు మామిడి బిక్షపతి, మామిడి అనిల్, పాశం అనిల్, మామిడి వంశీ, పాశం సంతోష్, బోళ్ల అంజి తదితరులు పాల్గొన్నారు.











