+91 99635 77856

ఎన్ హెచ్ ఆర్ సి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ఇమ్మడి ప్రణయ్, ప్రధాన కార్యదర్శిగా బత్తుల రాజశేఖర్..

కరీంనగర్/ హుజురాబాద్ అక్టోబర్ 21 (మా అక్షరం): జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) కరీంనగర్ జిల్లా స్థాయి సమావేశం జిల్లా ఇన్చార్జి విలాసాగరం పృథ్వీరాజ్ అధ్యక్షతన సోమవారం జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య, గౌరవ అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది సుంకనపల్లి రాము, రాష్ట్ర కమిటీ సభ్యులు ఓడేటి చంద్రశేఖర్ రెడ్డి, గుర్రాల సదన్న, పాక శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం తమ సంస్థ అయిన జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) చేస్తున్న కార్యక్రమాలకు బాధ్యతగల పౌరులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ఉద్యోగులు ముందుండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. రోజురోజుకు పెరుగుతున్న నేరాలు ఘోరాలు నియంత్రించాల్సిన బాధ్యత అధికారులకు ఉందని అన్నారు. ఈ విషయంలో అధికారులు బాధ్యతగా సఫలీకృతం కావాలని అన్నారు. ఈ సందర్భంగా సంస్థ విధి విధానాల గురించి కీలక ఉపన్యాసం చేశారు. ప్రతి పౌరులు బాధ్యతలు, హక్కులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం కరీంనగర్ జిల్లా నూతన కమిటీని నియమించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈ.సి సభ్యుడు ఎం.డి హాబీబ్, ప్రధాన కార్యదర్శి రాజయ్య, ఆర్గనైజింగ్ సెక్రెటరీ సాంబశివరావు, శ్రీరాముల రమేష్, ఎం.సుధాకర్, రాష్ట్ర ఈసీ సభ్యులు శ్రీనివాస్ యాదవ్, తిరుపతి, అరవింద రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల రాజన్న జిల్లాల అధ్యక్షులు పూసాల కృష్ణ, ఎనగందుల వెంకట్, సత్యనారాయణరెడ్డి, అనిల్ రెడ్డి మరియు రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు తదితరులు కట్కూరి నాగరాజు, సుంకనపెల్లి లక్ష్మణ్, సుంకనపెల్లి యశ్వంత్, సిద్ధం పవన్, కొండబత్తిని శ్రీనివాస్, ఇప్పకాయల సాగర్, నాపల్లి జగపతి, యం డి రఫీషేక్ పాల్గొననున్నారు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !