+91 99635 77856

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం..

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్..
హుజురాబాద్/ అక్టోబర్ 27(మా అక్షరం): అర్హులైన ప్రతి పేదవారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది.హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వోడితల ప్రణవ్ అన్నారు.హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చికిత్స నిమిత్తం లబ్దిదారులకు పది లక్షల విలువ చేసే ఎల్.ఒ.సీ లను,సీఎం.ఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.అనంతరం వోడితల ప్రణవ్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు,వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొంది ఆర్థిక భారం భరించలేక ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ భాద్యతగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి పొన్నం,పార్టీ ఇన్చార్జి ప్రణవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !