+91 99635 77856

అందరు కలిసి కొట్లాడుతూనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది…

-అప్పుల కుప్పగా మార్చిన గత తెలంగాణ ప్రభుత్వం..
-అంబేద్కర్ భవన నిర్మాణానికి, పివి జిల్లా సాధన కోసం నా వంతు సహకరిస్తాను..
-ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం…
హుజురాబాద్/నవంబర్ 03(మా అక్షరం): అందరు కలిసి కొట్లాడుతూనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, అటుకులు బుక్కి నేనే తెచ్చిన అంటే అది అవాస్తవమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం తెలంగాణ జన సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి ముక్కెర రాజు అధ్యక్షతన సిటీ సెంటర్ హాల్లో ఏర్పాటు చేసిన పౌర సమాజంతో మాట ముచ్చట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత ప్రభుత్వంలో మన పోరాట చరిత్రను గుర్తు చేసుకునే అవకాశం ఇవ్వలేదని.. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో గత పదేళ్లు మనమే పరాయి వాళ్ళం అయినామని కానీ ఈ రోజు మనం మన చరిత్రను గుర్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.ప్రజాస్వామ్య వాతావరణం కోసమే కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకున్నామని, ఈరోజు మనం నేరుగా సచివాలయానికి వెళ్లి మన సమస్యను చెప్పుకోవడానికి వీలుందన్నారు.సభలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు. విద్యా రంగంలో సమస్యల పరిష్కారం కోసం టీజీ పిఎస్సి తో నేను, హరగోపాల్ చర్చించామని విద్యా కమీషన్ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి తో సుదీర్ఘంగా చర్చించామన్నారు.ఈ ప్రభుత్వంలో సంప్రదింపులు జరిపే స్వేచ్ఛా వాతావరణం ఉందని, మన సమస్యలను వినడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వపు అనాలోచిత నిర్ణయాల వలన రాష్ట్రం తీవ్ర అప్పులపాలై ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద పైసలు అన్ని అటు మల్లిస్తే నీళ్ళు రాలే కానీ అప్పు మీద పడిందని విద్యుత్ రంగంలో అప్పులే, అన్ని రంగాల్లో అప్పులు చేశారన్నారు. రాష్ట్రం మొత్తం అప్పుల పాలయిందని. అప్పు తెచ్చిన వాటికి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని, మిషన్ భగీరథ ద్వారా 50 వేల కోట్ల అప్పు మీద పడిందని విద్యుత్ మీద తెచ్చిన అప్పు ఆ సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడిందని అన్నారు.ఈరోజు ఈ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మా వంతుగా వివిధ రంగాల్లో జరగాల్సిన పునఃనిర్మాణంపై విధివిధానాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సూచిస్తున్నామని, ఇవన్నిటినుండి బయటపడడానికి కృషి చేస్తున్నామన్నారు. పది నెలల్లో ప్రభుత్వానికి అవసరం అయ్యే సూచనలు చేశామని,తెలంగాణ పుననిర్మాణానికి కావాల్సిన వాటి కోసం కృషి చేస్తున్నామని, అప్పులతో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి జరిగే ఈ కృషిలో మనమందరం కలిసి ఉండాలి అన్నారు. ఈ రోజుకు నాకు ఎమ్మెల్సీ పదవి అంటే అది నా వ్యక్తిగతం కాదని మీ సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి అది ఒక సాధనం మాత్రమే అన్నారు.హుజూరాబాద్ లో సమావేశాలు నిర్వహించుకోడానికి భవన నిర్మాణం కోసం ఎమ్మెల్సీ నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. నలుగురు కలిసి మాట్లాడుకోవడం అనేది సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తుందని,సమాజానికి ఇలాంటి సమావేశాలు అవసరం అని పీవీ జిల్లా సాధనకు తన వంతు కూడా కృషి చేస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడిదల ప్రణవ్ ప్రజాసంఘాల నాయకులు వేల్పుల రత్నం పలకల ఈశ్వర్ రెడ్డి వేల్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !