– మహా పాదయాత్ర పోస్టర్ అవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి..
కరీంనగర్/ తిమ్మాపూర్, నవంబర్ 07 (మా అక్షరం న్యూస్):తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేయగా, రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వారి త్యాగాలను గుర్తించి గౌరవిస్తోందని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 27, 28, తేదీల్లో కరీంనగర్ లోని అమరవీరుల స్థూపం నుంచి వేములవాడ మహాదేవుని ఆలయం వరకు నిర్వహించతలపెట్టిన మహా పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఆయన ఎల్ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమకారులను గత ప్రభుత్వం తన రాజకీయ అవసరాల కోసం వాడుకొని వదిలేసిందని విమర్శించారు.అన్ని విధాలుగా ఉద్యమకారులను దగా చేసిందని ఆయన మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించిన ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి సముచితరీతిలో గౌరవిస్తుందన్నారు.తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తూ.చ తప్పకుండా నెరవేరుస్తుందని, భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.మంచి సంకల్పంతో నిర్వహించి తలపెట్టిన ఈ పాదయాత్రను విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి,రాష్ట్ర మహిళా నాయకురాలు ఐల ప్రసన్న,కంజర్ల రేణుక, భార్గవి,ఫోరం మండలాల అధ్యక్షులు దేవునూరి అంకూస్,గోశెట్టి సంజీవ్,బట్టి చంద్రమౌళి,భూమ సదానందం,కే.విద్యాసాగర్, తాటిపల్లి శంకర్, నాయకులు మామిడి మొగిలి, చొప్పరి సుధాకర్, తార, మామిడి వెంకటి తదితరులు పాల్గొన్నారు.











