కరీంనగర్, తిమ్మాపూర్/నవంబర్08(మా అక్షరం న్యూస్): మండలంలోని అల్గునూర్ చౌరస్తా వద్ద శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలు మానకొండూర్ నియోజకవర్గస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంతో కలిసి నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ….. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి నిర్బంధ పాలన కొనసాగించారని, అలాంటి అరాచక పాలనకు చరమ గీతం పాడించిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు.రాజకీయాల్లో ఎదురైన ఎన్నో సవాళ్లను తనకున్న శక్తి సామర్థ్యాలతో ఎదుర్కొని, కేసులకు ఏ మాత్రం బెదరకుండా ధైర్యంతో ప్రత్యర్థులను మట్టికరిపించి ఏకంగా రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యాడని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి కొనియాడారు. రేవంత్ రెడ్డి విలక్షణమైన వ్యక్తిత్వం, చిన్న వయసులోనే రాజకీయాల్లో డైనమిక్ లీడర్ గా ఎదిగిన తీరు యువతకు ఆదర్శమని, సమస్యల పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉండి, తెలియని విషయాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస రేవంత్ రెడ్డిలో మెండుగా ఉంటుందని, వివిధ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని, తడబాటు లేకుండా చెప్పగలగడం రేవంత్ రెడ్డికే సొంతమని, ముఖ్యమంత్రిగా ఎన్నికై తొలి పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తన స్వగ్రామం మానకొండూర్ మండలం పచ్చునూర్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో వరినారుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖచిత్రాన్ని రూపొందించిన రూపకర్తలు అజయ్,చందులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఘనంగా సత్కరించి అభినందించారు.కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా సెల్ కో-ఆర్డినేటర్ పెట్టం నవీన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, తిమ్మాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ జిల్లా కార్యాలయ ఇంచార్జీ గోపు మల్లారెడ్డి, పార్టీ నాయకులు చెన్నబోయిన రవి, కె.మల్లేశం, రమేశ్, శ్రీకాంత్, బండారి రమేశ్, చింతల లక్ష్మారెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, పోలు రాము, కొత్త తిరుపతిరెడ్డి, ఎస్.కొండల్ రావు, మాచర్ల అంజయ్య, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, మార్క నర్సయ్య, ఆశిక్ పాషా, రజాక్ అబ్దుల్, ఎండీ హసన్, టి.శ్రీనివాస్, ఎ.కుమార్. జి.తిరుపతి, రాయమల్లు తిదితరులు పాల్గొన్నారు.











