– ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ..మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు…
– స్వయంగా ఇంటింటికీ వెళ్లి సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ…
– కష్టకాలంలో అండగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు…
హుజురాబాద్/ నవంబర్ 08 (మా అక్షరం): పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హాజరై కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన,అనంతరం జమ్మికుంట పట్టణంలోని సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి సిఎం రేవంత్ రెడ్డి అని,దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి సమగ్ర కులగణన సర్వేను నిర్వహించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని,ఆరు గ్యారంటీల అమలు ద్వారా ప్రజలకు మరింత చేరువై,సేవ చేస్తూ దమ్మున్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు.అలాగే ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా హుజురాబాద్ మండలంలోని పలు గ్రామాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు.కష్టకాలంలో మాకు అండగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.











