+91 99635 77856

ఉప్పొంగిన అభిమానం

– మండల వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు…
– జిల్లా ఆస్పత్రిలో (𝐓𝐒𝐑) యువసేన ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం…

కరీంనగర్, తిమ్మాపూర్/ నవంబర్ 08 (మా అక్షరం న్యూస్):తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదిస్తూ తెలంగాణ ప్రజల అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు తిమ్మాపూర్ మండలం వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. టిఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. సిఎం రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం కరీంనగర్ లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో.. నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామిని అమలు చేస్తుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తుందని చెప్పారు.ఇప్పటికే రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే 500 కే గ్యాస్ సిలిండర్అందజేస్తున్నారు. కార్యక్రమంలో బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, గుంటి మధు, చింతల లక్ష్మారెడ్డి, బుడగ కొండయ్య, తాల్లపల్లి కిరణ్, గంకడి లక్ష్మారెడ్డి, హస్సన్, ఎండి నిస్సార్, సిరిగినేని లక్ష్మణ్ రావు, దొంత రమేష్, రోడ్డ అనిల్, ప్రకాశ్ తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !