హుజురాబాద్/నవంబర్13(మా అక్షరం): మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన పద్మశాలి ముద్దుబిడ్డ బండారి సదానందం కి వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ డైరెక్టర్ గా నియామకమైన సందర్భంగా ఆయనను బుధవారం చేనేత ఐక్యవేదిక యూత్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కుడికాల భాస్కర్ పుష్పగుచ్చంతో బహుకరించి… శాలువా తో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పద్మశాలి సమాజానికి సేవలు చేస్తూ రాజకీయ రంగంలో రాణిస్తున్న బండారు సదానందం ని అభినందిస్తూ మీరు భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ఈ పదవిని కల్పించినటువంటి కాంగ్రెస్ నాయకత్వానికి చేనేత ఐక్యవేదిక తరఫున మండల పద్మశాలి సంఘం తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మండలం పద్మశాలి సంఘం అధ్యక్షులు సంగెం సత్యనారాయణ,రాష్ట్ర చేనేత ఐక్యవేదిక నాయకులు రాష్ట్ర ప్రచార కార్యదర్శి జడల చిరంజీవి,రాష్ట్ర కార్యదర్శి కుడికాల సాయి, పట్టణ పద్మశాలి సంఘం కన్వీనర్ ఇప్పలపల్లి చంద్రశేఖర్,ఇప్పకాయల సాగర్ తదితరులు పాల్గొన్నారు.











