+91 99635 77856

ఆర్థిక సాయం..

Kudikala Sai Editor
maaksharamnews.in

ఆర్థిక సాయం..

- దినసరి కూలీ కుటుంబానికి కౌన్సిలర్ లావణ్య- నరసింహారెడ్డి చేయూత...

-ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మామిడి మొగిలి...

-మొగిలి మృతికి సంతాపాన్ని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపిన కౌన్సిలర్...

హుజురాబాద్/నవంబర్14(మా అక్షరం): పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి దినసరి కూలి మామిడి మొగిలి (50) ఇటివల అనారోగ్యంతో మృతి చెందగా అతని కుటుంబానికి మున్సిపల్ 26 వ వార్డు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య - నర్సింహారెడ్డి తన వంతు చేయూత అందించారు. గత 18 ఏళ్లుగా 26 వ వార్డులో నిర్వహించిన అన్ని అభివృద్ధి పనుల్లో మామిడి మొగిలి పాల్గొన్నారు. డ్రైనేజీల నిర్మాణం, సీసీ రోడ్లు, మరమ్మతులు నిర్వహణ వంటి అభివృద్ధి పనుల్లో మొగిలి బాసటగా నిలిచారని లావణ్య నరసింహారెడ్డి తెలిపారు. మొగిలి మృతి విషాదకరమని మృతికి సంతాపాన్ని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. మొగిలిది అత్యంత నిరుపేద కుటుంబమని, పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబానికి తమ వంతు సహాయం గా రూ.5 వేలు, ఒక బియ్యం బ్యాగు, ఇతర వస్తువులు మృతుని భార్య మంగకు అందచేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ ధోని పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

– దినసరి కూలీ కుటుంబానికి కౌన్సిలర్ లావణ్య- నరసింహారెడ్డి చేయూత…

-ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మామిడి మొగిలి…

-మొగిలి మృతికి సంతాపాన్ని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపిన కౌన్సిలర్…

హుజురాబాద్/నవంబర్14(మా అక్షరం): పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి దినసరి కూలి మామిడి మొగిలి (50) ఇటివల అనారోగ్యంతో మృతి చెందగా అతని కుటుంబానికి మున్సిపల్ 26 వ వార్డు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య – నర్సింహారెడ్డి తన వంతు చేయూత అందించారు. గత 18 ఏళ్లుగా 26 వ వార్డులో నిర్వహించిన అన్ని అభివృద్ధి పనుల్లో మామిడి మొగిలి పాల్గొన్నారు. డ్రైనేజీల నిర్మాణం, సీసీ రోడ్లు, మరమ్మతులు నిర్వహణ వంటి అభివృద్ధి పనుల్లో మొగిలి బాసటగా నిలిచారని లావణ్య నరసింహారెడ్డి తెలిపారు. మొగిలి మృతి విషాదకరమని మృతికి సంతాపాన్ని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. మొగిలిది అత్యంత నిరుపేద కుటుంబమని, పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబానికి తమ వంతు సహాయం గా రూ.5 వేలు, ఒక బియ్యం బ్యాగు, ఇతర వస్తువులు మృతుని భార్య మంగకు అందచేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ ధోని పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !