+91 99635 77856

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటనను విజయవంతం చేయాలి..

-ఘనంగా స్వాగతం పలుకుదాం..
-కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు..
కరీంనగర్/ నవంబర్ 14(మా అక్షరం): పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఈనెల 16 శనివారం మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లాకు పర్యటనకు వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పర్యటనకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. శనివారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ లో ఇందిరా భవన్ లో జరగనున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి పిసిసి అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు.బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ కరీంనగర్ జిల్లాకు మొట్టమొదటిసారి వస్తున్నందున నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు. కరీంనగర్ ముఖ ద్వారామైన శనిగరం నుండి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతామని, పెద్ద ర్యాలీతో ఇందిరా భవన్ కు చేరుకుంటామని తెలిపారు. ఇందిరా భవన్ లో జరిగే సమావేశంలో కుల గణన కుటుంబ సమగ్ర సర్వే, రాబోయే స్థానిక సంస్థల్లో పార్టీ తరఫున తీసుకోవాల్సిన చర్యలపై దేశానిర్దేశం, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యూహరచనపై సమగ్రంగా చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. దీంతోపాటు రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా చేపట్టాల్సిన పకడ్బందీ చర్యలపై పిసిసి అధ్యక్షుడు దేశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఎప్పటికప్పుడు తిప్పి కొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశానికి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని వెలిచాల రాజేందర్ రావు కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !