+91 99635 77856

కోతుల బెడద సమస్యను పరిష్కరించండి.. -మునిసిపల్ చైర్మన్, కమిషనర్లకు వినతి..

హుజురాబాద్/నవంబర్21(మా అక్షరం): పట్టణంలో కోతుల బెడదను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని 26వ వార్డు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నర్సింహారెడ్డి మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పట్టణంలో కోతుల బెడద అధికంగా ఉందని, ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. ప్రతినిత్యం కోతులు ఎవరినో ఒకరిని గాయపరుస్తున్నాయని.. వందల సంఖ్యలో కోతులు రోడ్లపై, గోడలపై ఇళ్లపై యధేచ్చగా సంచారం చేస్తూ ఉండడంతో.. మహిళలు వృద్ధులు పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారని పేర్కొన్నారు.ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చే రోగులు, రెవెన్యూ, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ ఇతర కార్యాలయాలకు వచ్చే సందర్శకులు,ఇందిరా మార్గంలోని వ్యాపారులు కోతుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సుదీర్ఘకాలంగా ఈ సమస్యను ప్రజలు ఎదుర్కొంటున్నారని, మున్సిపాలిటీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి కోతుల బెడదను నివారించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట 26 వ వార్డు యూత్ నాయకులు తిప్పబత్తిని విజయ్, పళ్ళ కిషోర్ లు ఉన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !