+91 99635 77856

సకల సౌకర్యాలతో సిద్ధమవుతున్న హుజరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్

-ప్రతి గదిని పరిశీలించి పని విధానాన్ని సూచించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
-నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు..

హుజురాబాద్/నవంబర్ 22(మా అక్షరం): ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏది చేసిన కొత్తగా ఉంటుంది. అందులో భాగంగానే హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా సకల సౌకర్యాలతో ప్రజలకు అన్ని విధాల ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారు. శుక్రవారం హుజురాబాద్ క్యాంప్ ఆఫీసు పనులను పరిశీలించిన ఆయన ప్రతి గదిని ఎలా డిజైన్ చేయాలో సూచించారు. ప్రజల అవసరాల నిమిత్తం క్యాంప్ ఆఫీసుకు వస్తే అన్ని విధాల ఏర్పాటు చేసేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రజలతో మాట్లాడడానికి ప్రత్యేక ఆఫీస్ తో పాటు మీటింగ్ లో పెట్టుకునేందుకు అనుగుణంగా ఉండేందుకు కాన్ఫరెన్స్ హాల్ ని కూడా అత్యధికంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున షెడ్ ఏర్పాటు చేసి వాహనాలను కూడా నిలిపేందుకు వీలుగా నూతన నిర్మాణం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… అతి త్వరలోనే హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అన్ని ఏర్పాట్లతో ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి అవసరాలు, సమస్యలున్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చు అన్నారు. సమస్యల కోసం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచి నీటి ఏర్పాటుతోపాటు భోజన సదుపాయం కూడా కల్పించేలా వసతులు చేపడతామని అన్నారు. ఇకపై నియోజకవర్గ ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది ఉన్న క్యాంప్ ఆఫీస్ కి వచ్చి సమస్య తెలిపితే వెంటనే ఆ సమస్య పరిష్కారం చేసేందుకు సిద్ధంగా ఉంటానని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !