+91 99635 77856

రోడ్డు ప్రమాదంలో ల్యాబ్ అసిస్టెంట్ రమేష్ మృతి..

హుజురాబాద్/ నవంబర్ 22(మా అక్షరం): పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్డు వద్ద విద్య నగర్ కు చెందిన హెల్త్(ల్యాబ్) అసిస్టెంట్ వకులాభరణం రమేష్ (52) శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేష్ గత కొన్ని ఏళ్లుగా పట్టణంలోని డాక్టర్ రామలింగారెడ్డి హాస్పటల్లో ల్యాబ్ అసిస్టెంట్ గా సేవలందించగా,ప్రస్తుతం ఎల్కతుర్తి మండలలో హెల్త్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. విధులు ముగించుకొని విద్య నగర్ లోని తన నివాసానికి వెళ్తుండగా అన్నపూర్ణ చౌరస్తా రోడ్డు దాటుతుండగా సైదాపూర్ క్రాస్ రోడ్డు వైపు వెళ్తున్న క్రమంలో భూపాలపల్లికి చెందిన కారు అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి రమేష్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో క్రాస్ రోడ్ లోని పండ్ల బండ్ల వద్ద ఎగిరిపడి తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు… రమేష్ కు గత ఐదేళ్ల క్రితమే భార్య మృతి చెందగా పెళ్లీడుకు ఎదిగిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రజలతో మమేకమై అంకితభావంతో కొన్నేళ్ల క్రితం ల్యాబ్ అసిస్టెంట్ గా సేవలందించిన రమేష్ ప్రభుత్వ వైద్యవర్గ శాఖలో హెల్త్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ కుటుంబం చక్కదిద్దుకుంటున్న క్రమంలో ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతని మిత్రులు, బంధువులలో తీవ్ర విషాదం నెలకొంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !