+91 99635 77856

నవంబర్ 26 న తిమ్మాపూర్ మండల అఖిల పక్షాల సమావేశం…

-తప్పకుండా హాజరుకావాలని విన్నపం..
కరీంనగర్, తిమ్మాపూర్/ నవంబర్ 23 (మాఅక్షరం):ఈనెల 26 న తిమ్మాపూర్ మండలం లోని అన్నీ పార్టీలకు సంబందించిన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహిస్తున్నట్లు శనివారం నాటి సమావేశం లో సమన్వయ కమిటీ నాయకులు తీర్మానం చేసారు. తిమ్మాపూర్ మండల పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి బస్ స్టేషన్ ఆవరణలో నెలకొల్పిన బాబా సాహెబ్ అంబేద్కర్, జగ్జీవన్ రాం విగ్రహాల పై ఉన్న ముసుగులను తొలగించాలని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుటకు మహాత్మానగర్ లోని తాపాల నృసింహస్వామి ఆలయ ఆవరణలో వివిధ పార్టీలకు సంబందించిన అధ్యక్షులతో, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది.మహనీయులపై ఉన్నటువంటి ముసుగుల తొలగింపు విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యం విషయం లో ఐక్య కార్యాచరణ కమిటీ (JAC) ని ఏర్పాటు చేసుకొని, ఒక నిర్థిష్టమైన ప్రణాళిక ద్వారా కార్యాచరణ ను రూపొందించుకొనుటకు నవంబర్ 26 న తిమ్మాపూర్ లోని అంబేద్కర్ భవనం లో జరిగే ముఖ్యమైన సమావేశానికి అన్నీ పార్టీలకు సంబందించిన అధ్యక్షులు,ముఖ్య నాయకులు,ప్రజాసంఘాల నాయకులు,తాజా మాజీ ప్రతినిధులు,ప్రజాస్వామ్య వాదులు,మేదావులు తప్పకుండా హాజరు కావాలని సమన్వయ కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ సమావేశం లో సీపీఎం నియోజకవర్గ కార్యదర్శి మాతంగి శంకర్,బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వంత్డపుల సంపత్,కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సముద్రాల లక్ష్మణ్,మాజీ సర్పంచ్ వడ్లూరి శంకర్,సీపీఐ జిల్లా నాయకులు గంగిపెల్లి శంకర్,ఆత్మ కమిటీ మాజీ సభ్యులు పాశం అశోక్ రెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఖమ్మం కృష్ణ,బిఆర్ఎస్ బోయిని తిరుపతి, నాయకులు సంగుపట్ల మల్లేశం, బీజేపీ నాయకులు ఎల్కపల్లి స్వామి, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ సమాద్,ఉప్పులేటి రాజు,మాతంగి రాజయ్య, అలవాల నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !