+91 99635 77856

సాంకేతిక పరిజ్ఞానంతో 50 సెల్ ఫోన్లు బాధితులకు అప్పగింత..

– సిఈఐఆర్ పోర్టల్ తో 50 సెల్ ఫోన్ల స్వాధీనం…
-హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి.. హుజురాబాద్/ నవంబర్ 27(మా అక్షరం): డివిజన్ పరిధిలో గత కొంతకాలంగా సెల్ ఫోన్ పోగొట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం సాంకేతిక పరిజ్ఞానాన్ని సిఈఐఆర్ పోర్టల్ ఉపయోగించి సుమారు 50 ఫోన్లు కనిపెట్టి బుధవారం హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో ఫోన్లు తిరిగి బాధితులందరికీ
అందజేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ మాట్లాడుతూ… సెల్ ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుంటే దొంగిలించిన ఫోన్లతో అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే ఆస్కారం ఉంటుందని అన్నారు. సెల్ ఫోన్ లో ముఖ్యమైన డాటా ను చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తంలో పోగొట్టుకున్న సెల్ ఫోన్లు కనిపెట్టి అందించడం అభినందనీయమని అన్నారు. పోలీసులు తమకు ఫోన్లు తిరిగి ఇప్పించినందుకు సంతోషంగా ఉందన్నారు. సెల్ ఫోన్ బాధితులంతా పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సిఐలు తిరుమల గౌడ్,పులి వెంకట్ గౌడ్, జమ్మికుంట సిఐలు వరగంటి రవి, కిషోర్, ఎస్సైలు తోట తిరుపతి,ఎన్.రాజకుమార్ లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !