+91 99635 77856

ప్రణాళికాబద్ధంగా ‘అంగారిక’ అభివృద్ధి

– మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
కరీంనగర్, తిమ్మాపూర్/ డిసెంబర్ 04 (మా అక్షరం): అంగారిక టౌన్ షిప్ ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పరుస్తామని మానకొండూరు శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని అంగారిక టౌన్షిప్ లో సుడా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి లతో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ… అంగారిక టౌన్షిప్ పనులను వేగవంతం చేస్తున్నామని, ఇళ్ల నిర్మాణాలకు అనువుగా టౌన్ షిప్ లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగారిక టౌన్షిప్ ను ఏ మాత్రం పట్టించుకోలేదని, గత ప్రభుత్వ నిర్వాకం వల్లనే అంగారిక అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అంగారిక టౌన్షిప్ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అభివృద్ధిలో అంగారికను ఆదర్శంగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహెల్ బాజ్ పాయ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ నాయకులు గోపు మల్లారెడ్డి అలువాల కుమార్, మాచర్ల అంజయ్య, గవ్వ రాజేందర్ రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కొత్త తిరుపతిరెడ్డి,బుదారపుశ్రీనివాస్,రావు సంపత్ రెడ్డి, మాచర్ల శ్రీనివాస్, పోలు రాము, రమేష్, ఆశిక్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !