ఎస్సీ రిజర్వేషన్ ను అడ్డుకునే మాలలను బహిష్కరిస్తాం
– మాదిగల ఐక్యవేదిక..
హుజురాబాద్ /డిసెంబర్ 15(మా అక్షరం):ఎస్సీ రిజర్వేషన్ ను అడ్డుకుంటున్న మాలలను బహిష్కరిస్తామని మాదిగల ఐక్యవేదిక నాయకులు హెచ్చరించారు. ఆదివారం ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం అధ్యక్షతన మాదిగల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం స్థానిక మధువని గార్డెన్స్ లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, టి పి సి సి ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీస్ రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు సంపత్ లో మాట్లాడుతూ… మాదిగలు అన్ని రంగాల్లో అణిచివేతకు గురై దుర్భర జీవితాలను వెల్లదీస్తున్నారని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో అత్యధిక శాతంలో ఉన్న మాదిగలు పూర్తిగా నష్టపోతున్నారని,రిజర్వేషన్ల ద్వారానే మాదిగలకు అభివృద్ధి సాధ్యమవుతుందని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, కె ఆర్ నాగరాజు లను, రేంజర్ల రాజేష్ ను దళిత సమాజం నుండి బహిష్కరించేందుకు ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశారు. అదేవిధంగా మాలలు ఎస్సీ రిజర్వేషన్ పై వైఖరి మార్చుకోకుంటే స్థానిక సంస్థల ఎన్నికలలో మాదిగలను ఓట్లు అడగకూడదని, మాలలకు ఓట్లు వేయకూడదని తీర్మానం చేశారు. అంతేకాకుండా మాదిగ కులస్తులు ఏ పార్టీలో ఉన్న పార్టీలకతీతంగా గెలిపించుకునేందుకు ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కృషి చేయాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మారెపల్లి శ్రీనివాస్, మాదిగ మహిళ విభాగం నాయకురాలు అకినపల్లి శిరీష, వేల్పుల రత్నం, వేల్పుల ప్రభాకర్, మొలుగురు ప్రభాకర్, కొండ్ర నరేష్, మొలుగూరి పూర్ణచందర్, తునికి సమ్మయ్య, మిడిదొడ్డి శ్రీనివాస్, పర్లపెల్లి రమేష్, ఎర్ర రవీందర్, ఎర్ర రమేష్, మోరే సతీష్, బోరగాల రాజయ్య, టేకుల శ్రావణ్, మిడిదొడ్డి రాజు, మోరే మధు, కొలుగూరి సూర్య కిరణ్, ఎర్ర రమేష్, ఎర్ర రవీందర్ తదితరులు పాల్గొన్నారు.











