+91 99635 77856

టిబి నిశ్చయ్ శిబిర్ పై అవగాహన సదస్సు

Kudikala Sai Editor
maaksharamnews.in

టిబి నిశ్చయ్ శిబిర్ పై అవగాహన సదస్సు

హుజురాబాద్/ డిసెంబర్16(మా అక్షరం): మండలంలోని సింగపూర్, బోర్నపల్లి గ్రామాలలో వందరోజుల టిబి నిశ్చయ్ శిబిర్ అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ డిఎంహెచ్ డాక్టర్ చందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెండు వారాల పాటు ఎడతెరిపిని లేకుండా దగ్గు జ్వరము వాసనతో కూడిన తేమడ ఆకలి లేకపోవడం బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి నందు వెంటనే తెమడ పరీక్ష, ఎక్స్రే లు తీసుకోవాలని ఆయన తెలిపారు. టీబీ వ్యాధి ఎక్కువగా నిరక్షరాస్యత పోషకాహార లోపం ఉన్నవారికి వస్తుందని దీనిని అశ్రద్ధ చేయొద్దని ఆయన కోరారు. టీబీ వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే భయపడవలసిన అవసరం లేదని ఉచితంగా ప్రభుత్వము మందులు పంపిణీ చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చెల్పూర్ వైద్యాధికారులు డాక్టర్ మధు, డాక్టర్ జెహ్రూ, సి హెచ్ ఓ శ్యామ్, డిస్టిక్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, విజేందర్ రెడ్డి టీబీ వ్యాధి సిబ్బంది కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ డిసెంబర్16(మా అక్షరం): మండలంలోని సింగపూర్, బోర్నపల్లి గ్రామాలలో వందరోజుల టిబి నిశ్చయ్ శిబిర్ అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ డిఎంహెచ్ డాక్టర్ చందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రెండు వారాల పాటు ఎడతెరిపిని లేకుండా దగ్గు జ్వరము వాసనతో కూడిన తేమడ ఆకలి లేకపోవడం బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి నందు వెంటనే తెమడ పరీక్ష, ఎక్స్రే లు తీసుకోవాలని ఆయన తెలిపారు. టీబీ వ్యాధి ఎక్కువగా నిరక్షరాస్యత పోషకాహార లోపం ఉన్నవారికి వస్తుందని దీనిని అశ్రద్ధ చేయొద్దని ఆయన కోరారు. టీబీ వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే భయపడవలసిన అవసరం లేదని ఉచితంగా ప్రభుత్వము మందులు పంపిణీ చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చెల్పూర్ వైద్యాధికారులు డాక్టర్ మధు, డాక్టర్ జెహ్రూ, సి హెచ్ ఓ శ్యామ్, డిస్టిక్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, విజేందర్ రెడ్డి టీబీ వ్యాధి సిబ్బంది కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !