+91 99635 77856

ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యం..

Kudikala Sai Editor
maaksharamnews.in

ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యం..

- మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్..

కరీంనగర్/ మానకొండూర్ డిసెంబర్ 16 (మా అక్షరం):మానకొండూరు మండలకేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ...ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విడుదల చేసిన ప్రగతి నివేదికలో నియోజకవర్గానికి 360 కోట్లు లెక్క ఉండగా ఎమ్మెల్యే నిధుల నుండి గాని, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుండి గాని ఖర్చుపెట్టినది ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. మానకొండూర్ నియోజకవర్గానికి 50 పడకల ఆసుపత్రి,360కోట్లలో 17కోట్ల 50లక్షలు ఎందుకు లేదని అసంపూర్తిగా ఉన్న లక్ష్మీపూర్ ఆరోగ్య కేంద్రం, గన్నేరువరం ఆరోగ్య కేంద్రం, ఇల్లంతకుంట 50 పడకల ఆసుపత్రి ఏమైందని ప్రశ్నించారు.ఓట్ల కోసం పడ్డతిప్పల ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు లేదని,సంవత్సర కాలంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి ఇసుక మాఫియా, గుట్టల మాఫియా, వసూళ్ల మాఫియా లాంటి అభివృద్ధి పనులు తప్ప ప్రజలకు చేసింది శూన్యమని ఆరోపించారు. నియోజకవర్గంలో గతంలో వచ్చిన రోడ్లకు రినివల్స్ ను ఆపిండని ఇది ప్రగతి నివేదికలో ఎందుకు చేర్చలేదని గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డుకు మంజూరైన 72 కోట్ల రూపాయలలో కోటి రూపాయలు ఎవరు మింగారని అది ఎందుకు పూర్తి కావడం లేదని, ఇల్లంతకుంట నుండి సిద్దిపేటకు డబుల్ రోడ్డు ఏమైందని,153 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పని ఎందుకు ఆగిందని వీటి గురించి నివేదిక ఎందుకు రాయలేదని బెజ్జెంకిలో తాను కష్టపడి తీసుకువచ్చిన రోడ్లను కాన్సిల్ చేయించాడని ఆవేదన చెందారు. శంకరపట్నం, తిమ్మాపూర్, ఇల్లంతకుంట మండలాలలో అరుంధతి కళ్యాణ మండపాలు పూర్తి కాలేదని, ఎన్ఆర్ఐ నిధులు ఎమ్మెల్యే నిధులు కాదని ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నిధులని, నియోజకవర్గంలో 50 శాతం కూడా రుణమాఫీ జరగలేదని జరగకుండా జరిగిందని ఫోజులు కొడుతున్నారని మండిపడ్డారు.ప్రభుత్వం వడ్ల కొనుగోలులో పూర్తిగా విఫలమైందని ఇచ్చిన హామీలు నెరవేర్చేసరికి ఉన్న 4ఏండ్ల కాలం అయిపోయి అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతూ ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్ కే సాధ్యమని అన్నారు. మానకొండూరు మండలంలో ఇసుక, మట్టి మాఫియాను ఆపాలని,బెజ్జెంకి మండలం గుగ్గిల్లలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేసి మూయించాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు.కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సిద్ధం వేణు, తిమ్మాపూర్ మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనితా- దేవేందర్ రెడ్డి నాయకులు పిట్టల మదు,సుదగోని సదయ్య గౌడ్,గంట మహిపాల్,నర్సయ,గడ్డం నాగరాజు,గుర్రం కిరణ్,ఎం.డీ గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

– మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్..

కరీంనగర్/ మానకొండూర్ డిసెంబర్ 16 (మా అక్షరం):మానకొండూరు మండలకేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ …ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విడుదల చేసిన ప్రగతి నివేదికలో నియోజకవర్గానికి 360 కోట్లు లెక్క ఉండగా ఎమ్మెల్యే నిధుల నుండి గాని, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుండి గాని ఖర్చుపెట్టినది ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. మానకొండూర్ నియోజకవర్గానికి 50 పడకల ఆసుపత్రి,360కోట్లలో 17కోట్ల 50లక్షలు ఎందుకు లేదని అసంపూర్తిగా ఉన్న లక్ష్మీపూర్ ఆరోగ్య కేంద్రం, గన్నేరువరం ఆరోగ్య కేంద్రం, ఇల్లంతకుంట 50 పడకల ఆసుపత్రి ఏమైందని ప్రశ్నించారు.ఓట్ల కోసం పడ్డతిప్పల ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు లేదని,సంవత్సర కాలంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి ఇసుక మాఫియా, గుట్టల మాఫియా, వసూళ్ల మాఫియా లాంటి అభివృద్ధి పనులు తప్ప ప్రజలకు చేసింది శూన్యమని ఆరోపించారు. నియోజకవర్గంలో గతంలో వచ్చిన రోడ్లకు రినివల్స్ ను ఆపిండని ఇది ప్రగతి నివేదికలో ఎందుకు చేర్చలేదని గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డుకు మంజూరైన 72 కోట్ల రూపాయలలో కోటి రూపాయలు ఎవరు మింగారని అది ఎందుకు పూర్తి కావడం లేదని, ఇల్లంతకుంట నుండి సిద్దిపేటకు డబుల్ రోడ్డు ఏమైందని,153 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పని ఎందుకు ఆగిందని వీటి గురించి నివేదిక ఎందుకు రాయలేదని బెజ్జెంకిలో తాను కష్టపడి తీసుకువచ్చిన రోడ్లను కాన్సిల్ చేయించాడని ఆవేదన చెందారు. శంకరపట్నం, తిమ్మాపూర్, ఇల్లంతకుంట మండలాలలో అరుంధతి కళ్యాణ మండపాలు పూర్తి కాలేదని, ఎన్ఆర్ఐ నిధులు ఎమ్మెల్యే నిధులు కాదని ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నిధులని, నియోజకవర్గంలో 50 శాతం కూడా రుణమాఫీ జరగలేదని జరగకుండా జరిగిందని ఫోజులు కొడుతున్నారని మండిపడ్డారు.ప్రభుత్వం వడ్ల కొనుగోలులో పూర్తిగా విఫలమైందని ఇచ్చిన హామీలు నెరవేర్చేసరికి ఉన్న 4ఏండ్ల కాలం అయిపోయి అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతూ ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్ కే సాధ్యమని అన్నారు. మానకొండూరు మండలంలో ఇసుక, మట్టి మాఫియాను ఆపాలని,బెజ్జెంకి మండలం గుగ్గిల్లలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేసి మూయించాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు.కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సిద్ధం వేణు, తిమ్మాపూర్ మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనితా- దేవేందర్ రెడ్డి నాయకులు పిట్టల మదు,సుదగోని సదయ్య గౌడ్,గంట మహిపాల్,నర్సయ,గడ్డం నాగరాజు,గుర్రం కిరణ్,ఎం.డీ గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !