+91 99635 77856

బీసీలకు స్థానిక సంస్థలో 42 శాతం వాటా కల్పించాలని ఒకరోజు దీక్ష…

-బిసి ఆజాద్ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్…

(కుడికాల సాయి మా అక్షరం ప్రతినిధి)

హుజురాబాద్/డిసెంబర్16(మా అక్షరం): పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద సోమవారం బిసి ఆజాద్ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ సోమవారం ఒక్కరోజు సత్యాగ్రహ నిరాహార దీక్ష చేపట్టారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుడికాల భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి సందేల వెంకన్న,రాష్ట్ర కార్యదర్శి,ఇప్పాకాయల సాగర్,జిల్లా కన్వీనర్ చిలక మారి శ్రీనివాస్,ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా ఇట్టి సమావేశానికి బీసీ నాయకులు చందుపట్ల జనార్ధన్ అధ్యక్షత వహించారు. ఈ సత్యాగ్రహ దీక్షకు టిఆర్ఎస్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు జీవీ కృష్ణారావు, కరీంనగర్ మాజీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ టాకు రవీందర్ సింగ్,టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండా శ్రీనివాస్, హుజూరాబాద్ మునిసిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయకుమార్,కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ సొల్లు బాబు,టిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ కొలిపాక శ్రీనివాస్ నాయకులు వడ్లూరి వాసు, ఆలేటి రవీందర్,కట్కూరి రాజేందర్,న్యాయవాది ముక్కెర రాజు,కొత్తూరి రమేష్, కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, చింత శ్రీనివాస్, ఇంద్ర, ఇమ్రాన్,కుమార్ గౌడ్ మాజీ సర్పంచ్ నిరోషా కిరణ్, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కామారెడ్డి లో డిక్లరేషన్ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము రానున్న స్థానిక సంస్థలలో బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి తమ మాటను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, అదే విధంగా బీసీలకు అన్ని రంగాలలో న్యాయం జరిగే విధంగా నేటి ప్రభుత్వము చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. మధుసూదన్ రాజ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు గజవెల్లి మనోహర్, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జింఖాల లక్ష్మణరావు,కమలాపూర్ మండల అధ్యక్షుడు రవి ,బీసీ నాయకులు సబ్బని రాజేందర్, ఉప్పు శ్రీనివాస్,ఆలేటి రవీందర్,వెన్నం రాజేందర్, సాగర్,కూరపాటి రామచందర్, సదానందం,కళాకారులు రామ్, రాజేశ్వర్,నవీన్, తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !