–టియుడబ్ల్యూజే (ఐజేయు) జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్..
కరీంనగర్/డిసెంబర్ 29 (మా అక్షరం): టియుడబ్ల్యూజె (ఐజెయు) కరీంనగర్ జిల్లా శాఖ కార్యవర్గ సమావేశాన్ని స్థానిక ప్రెస్ భవన్ లో జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంవత్సర కాలంగా కరీంనగర్, హుజురాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పై నెలకొన్న సమస్య పరిష్కారానికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం జిల్లా శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు.కరీంనగర్ పట్టణంలో ఇళ్ల పట్టాలు పొందిన జర్నలిస్టులు, పొందవలసిన జర్నలిస్టులు సమిష్టిగా కృషి చేస్తే సమస్య సులభంగా పరిష్కారం అవుతుందని అన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పరిష్కారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సుముఖంగా ఉన్నట్లు చెప్పారు.యూనియన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదని హెచ్చరించారు.అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్ మాట్లాడుతూ.. త్వరలోనే కరీంనగర్, హుజరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇళ్ల స్థలాలు రాని జర్నలిస్టుల పక్షాన జిల్లా కమిటీ పోరాటం చేయాలని స్పష్టం చేశారు.వీటితోపాటు జిల్లా కార్యవర్గ సమావేశంలో ప్రధాన ఎజెండాగా పెట్టుకున్న అంశాలు జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు,జర్నలిస్టుల ప్రమాద బీమా,హెల్త్ కార్డులు,శిక్షణ తరగతులు, సబ్ కమిటీలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సభ్యులు పలు కీలక సూచనలు చేశారు. అనంతరం పలు ముఖ్యమైన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదం తోపాటు సబ్ కమిటీలను నియమించినట్లు అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్ కొయ్యడ చంద్రశేఖర్ లు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్, జాతీయ కౌన్సిల్ సభ్యులు జానంపేట మారుతి, రాష్ట్ర నాయకులు బల్మూరి విజయసింహారావు, నర్సింగోజు మహేంద్ర చారి, ఒంటెల కృష్ణ, ఈద మధుకర్ రెడ్డి, మార్త ప్రకాష్,సయ్యద్ ఇమామ్, కోశాధికారి గాజుల వెంకటేష్,జిల్లా ఉపాధ్యక్షులు గాండ్ల సంపత్,ఎండి సుకూర్, ఏ శైలేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు దాడి సంపత్, పోలు సంపత్, జిల్లా కార్యవర్గ సభ్యులు జన్నారం శ్రీనివాస్,డి రాజశేఖర్, సిరిసిల్ల అనిల్ కుమార్,డి కుమారస్వామి,బి తిరుపతి,మోసిన్ మొయినుద్దీన్,బి పరుశురాం గౌడ్,నర్సింగం,చేతన్ క్రాంతి,కె రఘు, మహమ్మద్ రఫీ, కె గంగరాజు, ఎస్ రాజిరెడ్డి లు పాల్గొన్నారు.
నామినేటెడ్ నియామకాలు
ఎన్ భరణి కుమార్ : ఉపాధ్యక్షులు, హుజురాబాద్
కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు
సంబోజి శేఖర్ – చొప్పదండి
ఎండి మునీర్ – వీణవంక
జి స్వామి – శంకరపట్నం
జి కేశవరెడ్డి
ఎండి అస్గర్ హుస్సేన్- కరీంనగర్
మహమ్మద్ అఫ్జల్ పాషా
పి సదానందం – కరీంనగర్
వేల్పుల సునీల్ కుమార్ – హుజురాబాద్
అనుబంధ కమిటీలు
..దాడుల నివారణ కమిటీ..
శ్రీరామ్ రవీందర్ – కన్వీనర్ గంగాధర
సిహెచ్ సత్యరాజ్ – సభ్యులు హుజురాబాద్
జె వెంకటస్వామి – సభ్యులు చిగురుమామిడి
..నిజ నిర్ధారణ కమిటీ..
ఎంఏ అసద్ – కన్వీనర్, కరీంనగర్
కె సృజన్ కుమార్ – సభ్యులు, తిమ్మాపూర్
జె సుమ – సభ్యురాలు, కరీంనగర్
..జర్నలిస్టుల సంక్షేమ కమిటీ..
తోడేటి తిరుపతి – కన్వీనర్, కరీంనగర్
ఆర్ విష్ణుమూర్తి – సభ్యులు, మానకొండూరు
అల్లాడి శ్రీనివాస్ – సభ్యులు సబ్ ఎడిటర్, కరీంనగర్
..స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కమిటీ..
వడ్లకొండ సదానందం – కన్వీనర్, కరీంనగర్
వి భాస్కర్ – సభ్యులు, ఇల్లంతకుంట
బొడ్డు శ్రీనివాస్ – హుజురాబాద్











