హుజురాబాద్/జనవరి 03(మా అక్షరం): పట్టణంలోని సావిత్రిబాయి పూలే 194 జయంతి వేడుకలు శుక్రవారం జయంతోత్సవ కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అవమానాల్ని అక్షరాలు గా మలిచి పీడిత తాడిత బ్రతుకులల్లో వెలుగులు ప్రసాదించిన మహాతల్లి మన భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చదువు తల్లి సావిత్రి భాయ్ పూలే అని అన్నారు.ఈ కార్యక్రమంలో యస్సి కార్పోరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ గందె శ్రీను-రాధిక, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, తెలంగాణా రాష్ట్ర యస్సి యస్టి అట్రాసిటీ ఆప్ కన్వీనర్ తిప్పారపు సంపత్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ యండి ఖలీద్, హుస్సేన్ హనుమాన్ టెంపుల్ చైర్మెన్ కొలిపాక శంకర్, పట్టణ సిఐ తిరుమల్ గౌడ్, మేకల తిరుపతి, సొల్లు బాబు, ఖాజీపేట శ్రీనివాస్, చందుపట్ల జనార్ధన్,యూత్ నాయకులు చల్లూరి రాహుల్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, వేల్పుల రత్నం, వేల్పుల ప్రభాకర్, ఈశ్వర్ రెడ్డి, యండి అలీం, యండి(SK)జలీల్, యేముల పుష్పలత, యండి అఫ్సర్, యండి తౌసీఫ్, రియాజ్, బండారి సదానందం, శేఖర్, యువజన నాయకులు మేకల రాజు కుమార్, గోస్కుల నాగమణి-మదుకర్, జమదగ్ని, తుమ్మనపల్లి కుమార్, వెంకట్, ఇల్లందుల రమేష్, నడిగోటి రమేష్, సందీప్, చందు, బండ నవీన్, రేవంత్ సొల్లు సునితతో పాటు ఫూలే అంబేద్కర్ వాదులు మహిళ ఉపాధ్యాయురాల్లు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.











