హుజురాబాద్/జనవరి02(మా అక్షరం): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఎన్నికలలో గెలుపొందిన పలువురు నాయకులకు స్థానిక తాజ్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాజిపేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా ఎదగడానికి రాహుల్ గాంధీ ప్రవేశ పెట్టిన యువజన కాంగ్రెస్ ఎలక్షన్ ప్రక్రియ గొప్ప అవకాశంగా మారిందన్నారు. పార్టీ అన్ని వర్గాలను ప్రోత్సహిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా విభాగాలకు ప్రత్యేక అవకాశం కల్పించి ఉత్సహావంతులైన యువతను ప్రోత్సహించడం వలన సమన్యాయం జరిగే అవకాశం కేవలం కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉందన్నారు.యువజన నాయకులు క్రమశిక్షణ చిత్తశుద్ధితో పనిచేసిన వారిని అధిష్టానం తప్పకుండా గుర్తిస్తుందని అన్నారు. నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ బాబు నాయకత్వంలో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా కృషి చేయాలని కోరారు. సన్మానం పొందిన వారిలో యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపెల్లి నాగరాజు,జిల్లా కార్యదర్శి ఎండి.సజ్జు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్యులు ఆడెపు శ్రీకాంత్,బొరగాల సంపత్,కందుల సందీప్,చింతల నరేష్, చిట్యాల రేవంత్, ఎండి. సల్మాన్, హుజురాబాద్ మండల ఉపాధ్యక్షులు రేణికుంట్ల సందీప్, ప్రధాన కార్యదర్శులు అజయ్, ఎస్టి. సమీ, కమలాపూర్ మండల ప్రధాన కార్యదర్శి గాలీబ్ నవీన్, కార్యదర్శి ఆసిఫ్, జమ్మికుంట మండల ఉపాధ్యక్షులు ఆకినపల్లి శ్యామ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటి డైరెక్టర్ బండారి సదానందం, అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ ఖాలీక్ హుస్సేన్, నాయకులు సంగెం శ్రీనివాస్, కొలిపాక రమేష్, మాచర్ల నరేష్ పాల్గొన్నారు.











