+91 99635 77856

జర్నలిస్టులకు అండగా ఉంటాం

– మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి..
కరీంనగర్, తిమ్మాపూర్ జనవరి 05 (మా అక్షరం):తిమ్మాపూర్ మండలం ఎల్ఎండిలోని తాపాల లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ మండపంలో తిమ్మాపూర్ మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యుల పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని పాత్రికేయులు ఘనంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరవగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి, పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.అనంతరం ఇటీవల కాలం చేసిన సీనియర్ జర్నలిస్ట్ దూసేటి మహేందర్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి ఎమ్మెల్యేతో పాటు మండలానికి చెందిన వివిధ పార్టీల నాయకులు నూతన కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ..ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా ఉండే జర్నలిస్టులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని,గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.గతంలో కొన్ని పత్రికలు విలేకరులకు ఎంతో కొంత వేతనం ఇస్తుండగా ప్రస్తుతం అవి కూడా ఇవ్వడం లేదన్నారు.ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు నిధులు సైతం నిధులు మంజూరు చేసి ప్రజాహితం కోరే పాత్రికేయులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి హామీ ఇచ్చారు.కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బత్తుల రాకేష్ (సాక్షి), ప్రధాన కార్యదర్శి బొట్టు శ్రీనివాస్ (టీవీ5, శ్వేతన్యూస్), ఉపాధ్యక్షులు నాగెల్లి ఆంజనేయులు (హెచ్ఎంటీవీ, మైత్రి), ఎండీ రహీం (బిగ్ టీవీ), గౌరవ అధ్యక్షుడు ముస్కు లక్ష్మారెడ్డి(మహాన్యూస్), జిల్లా ఈసీ మెంబర్ సిరిసిల్ల అనిల్(ప్రైమ్ 9), సలహా దారు వేల్పుల రాజు(నమస్తే తెలంగాణ), కోశాధికారి ఆంజనేయులు (నవ తెలంగాణ), సంయుక్త కార్యదర్శి కొంపల్లి సతీష్ (ఎన్టీవీ), బూమాడి శ్రీధర్ రెడ్డి (నమస్తే తెలంగాణ రూరల్), ప్రచార కార్యదర్శి జాప నాగరాజు (చురుకలు), లీగల్ అడ్వైజర్ మాతంగి రవి (దిశ), కార్యవర్గ సభ్యులు తూముల శ్రీనివాస్ (టీ న్యూస్), విష్ణు (ఆంధ్రప్రభ), విజయ్ కుమార్ (మన తెలంగాణ), రాజిరెడ్డి (99టీవీ), మండలంలోని కాంగ్రెస్,బిఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !