+91 99635 77856

రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులు పాటించాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులు పాటించాలి

- హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వాహనదారులకు గులాబీ పూలు ఇచ్చి విద్యార్థుల వినూత్న అవగాహన..
- హుజరాబాద్ టౌన్ సిఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం..
హుజురాబాద్/జనవరి06(మా అక్షరం): ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని హుజురాబాద్ టౌన్ సీఐ తిరుమల గౌడ్ సూచించారు. సోమవారం జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని... పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాల విద్యార్థుల తో ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు అవగాహన కల్పించారు. జమ్మికుంట-కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వస్తున్న వాహనాదారులను ఆపి గులాబీ పూలను ఇచ్చి వినూత్నంగా అవగాహన కల్పించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ... అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు హెల్మెట్స్ మనల్ని రక్షిస్తాయని..ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ నిబంధనల ప్రకారంగా వాహనాలను నడపాలని సూచించారు.అతివేగం అజాగ్రత్తగా నడిపి కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని అన్నారు.వాహనాల వెంట ధ్రువీకరణ పత్రాలు ఉండాలని,మద్యం సేవించడం ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం చేయరాదని తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

– హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వాహనదారులకు గులాబీ పూలు ఇచ్చి విద్యార్థుల వినూత్న అవగాహన..
– హుజరాబాద్ టౌన్ సిఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం..
హుజురాబాద్/జనవరి06(మా అక్షరం): ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని హుజురాబాద్ టౌన్ సీఐ తిరుమల గౌడ్ సూచించారు. సోమవారం జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని… పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాల విద్యార్థుల తో ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు అవగాహన కల్పించారు. జమ్మికుంట-కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వస్తున్న వాహనాదారులను ఆపి గులాబీ పూలను ఇచ్చి వినూత్నంగా అవగాహన కల్పించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ… అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు హెల్మెట్స్ మనల్ని రక్షిస్తాయని..ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ నిబంధనల ప్రకారంగా వాహనాలను నడపాలని సూచించారు.అతివేగం అజాగ్రత్తగా నడిపి కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని అన్నారు.వాహనాల వెంట ధ్రువీకరణ పత్రాలు ఉండాలని,మద్యం సేవించడం ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం చేయరాదని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !