+91 99635 77856

వూట్కూరి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం

– తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మానకొండూరు మండల అధ్యక్షులు ముక్కెర సతీష్ కుమార్..
కరీంనగర్, తిమ్మాపూర్ జనవరి 07 (మా అక్షరం):కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలకేంద్రంలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో కరీంనగర్,మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డిని మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుతూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మానకొండూరు మండల అధ్యక్షులు ముక్కెర సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లం లింగమూర్తి పటేల్ హాజరై మాట్లాడుతూ….ఆంధ్ర విద్యాసంస్థలకు దీటుగా, ఉత్తర తెలంగాణలో గత 40 సంవత్సరాల క్రితం విద్యాసంస్థలు స్థాపించి, అనేక మంది విద్యార్థులను ఉత్తేజ వంతులుగా చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు గ్రంధాలయాలలో చదువుతున్న విద్యార్థులకు నరేందర్ రెడ్డి మౌలిక వసతులు కల్పించిన విషయం గుర్తు చేశారు, వివిధ ఉద్యోగాలకు సన్నద్దం అవుతున్న విద్యార్థులకు ఉచిత శిక్షణా కేంద్రాలు ఏర్పాటుచేసి, ఉచిత మెటీరియల్ ఇచ్చి అండగా నిలిచారని కావున నాలుగు జిల్లాల్లోని పట్టభద్రులు ఎమ్మెల్సీ గా వూట్కూరి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంట అజయ్ పటేల్, సంఘం కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ కాల్వ మధుబాబు, గట్టు తిరుపతి, పాండురాల కనక రాజేశం, బొడ్డు అయిలయ్య, నడిబొట్టు శంకర్, బొంగుని సునీల్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !