+91 99635 77856

తిరుపతిలో తొక్కిసలాట బాధాకరం

Kudikala Sai Editor
maaksharamnews.in

తిరుపతిలో తొక్కిసలాట బాధాకరం

-మృతుల కుటుంబాలకు సానుభూతి..
ఇలాంటి ఘటనలు జరగకుండా ఏపీ ప్రభుత్వం,టిటిడి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..
-కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి...
కరీంనగర్ /జనవరి10(మా అక్షరం): శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర బుధవారం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టిటిడి బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ... బాధితులను ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తొక్కి సలాటలో గాయపడ్డ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. తిరుపతికి లక్షలాది మంది భక్తులు నిత్యం వస్తుంటారని, వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయని పేర్కొన్నారు. మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ కోటి రూపాయల సహాయం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. తొక్కిసలాట ఘటన తో తీవ్ర ఆవేదనకు గురయ్యానని రాజేందర్ రావు పేర్కొన్నారు. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు మృతి చెందడం దురదృష్టకరమన్నారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు రాజేందర్ రావు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరారు.

Share ePaper Clip

Preparing image...

-మృతుల కుటుంబాలకు సానుభూతి..
ఇలాంటి ఘటనలు జరగకుండా ఏపీ ప్రభుత్వం,టిటిడి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..
-కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి…
కరీంనగర్ /జనవరి10(మా అక్షరం): శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర బుధవారం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టిటిడి బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ… బాధితులను ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తొక్కి సలాటలో గాయపడ్డ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. తిరుపతికి లక్షలాది మంది భక్తులు నిత్యం వస్తుంటారని, వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయని పేర్కొన్నారు. మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ కోటి రూపాయల సహాయం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. తొక్కిసలాట ఘటన తో తీవ్ర ఆవేదనకు గురయ్యానని రాజేందర్ రావు పేర్కొన్నారు. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు మృతి చెందడం దురదృష్టకరమన్నారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు రాజేందర్ రావు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !