-గ్రామాల్లో భోగి పండుగ విశిష్టతను చాటిన రంగవల్లులు..
-ఉత్సాహంగా ముగ్గుల పోటీలు..
హుజురాబాద్/జనవరి12(మా అక్షరం):ముగ్గుల పోటీలు సంస్కృతికి,సాంప్రదాయాలకు హుజురాబాద్ మండలంలోని సింగాపూర్ గ్రామంలో ఆదివారం భోగి పండుగ సందర్భంగా యువనాయకులు వోడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లావణ్య, సింగాపూర్ మాజీ సర్పంచ్ మంద మంజుల, సి ఎ గుడిపాటి లలిత, పద్మ మహిళా సంఘం అధ్యక్షులు అన్నపూర్ణ బహుమతులు అందజేశారు.ప్రణవ్ బాబు ఫోన్లో అందుబాటులోకి వచ్చి రామ మహిళలకు అనంతరం ఆయన మాట్లాడుతూ..సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. మహిళలు ఉదయం పూట ఇళ్ళ ముందు ముగ్గులు వేయడం మంచి వ్యాయామమన్నారు.దీంతోపాటు మహిళల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. ముగ్గుల పోటీలు ఐక్యతకు, ఆప్యాయతకు నిదర్శనమన్నారు.మన తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. సంక్రాంతి పండుగ ప్రకృతి పండుగ అని తెలిపారు.సాంస్కృతిక అంశాలు మానసిక వికాసానికి,శారీరక ఆరోగ్యానికి, ఏకాగ్రతకు ఎంతగానో దోహదపడుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.











