+91 99635 77856

పి వి విగ్రహ ఏర్పాటుకు సహకరించండి

-పి వి సేవా సమితి
హుజురాబాద్/ జనవరి 18 (మా అక్షరం): పట్టణంలో పీవీ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే పీవీ విగ్రహానికి సహకరించాలని శుక్రవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షుడు తూము వెంకట రెడ్డి మాట్లాడుతూ… పీవీ నరసింహారావు ప్రపంచం గర్వించ దగ్గ మేధావి అని భారతరత్న, నేటి వర్తమాన భవిష్యత్తు నాయకులకు స్ఫూర్తి ప్రదాత అని మాజీ ప్రధాని పివి ఈ దేశానికి అందించిన సేవలను గుర్తుచేశారు. పివి సేవాసమితి పట్టణంలో నిర్వహించే ఈ మహాత్తర
పివి విగ్రహ ఏర్పాటుకు పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజాసంఘాలు సహకరించాలి కోరారు.మన తెలుగుబిడ్డగా మనం గౌరవించుకోవలసినఅవసరం ఉంది అని అన్నారు. విగ్రహ ఏర్పాటుకు తమ సహకారం ఉంటుందని సుముఖత వ్యక్తం చేసిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు ఈ ప్రాంత పివి అభిమానులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు బి. మనోజ్ తదితరులు
పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !