– కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి..
తిమ్మాపూర్/ జనవరి 20 (మా అక్షరం): మండలం ఎల్ఎండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసత్య ఆరోపణలు చేశాడంటూ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండలాద్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి మాట్లాడుతూ ….రసమయి దగ్గరున్న నాయకులకు ఒకప్పుడు ఏమీలేదని ఇప్పుడు వాళ్ళకు డబుల్ బిల్డింగ్ లు,కార్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.రసమయి చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉద్యమంలో పాల్గొన్నవారు ఉన్నారా అని ఉద్యమంలో లేనోళ్లను పక్కన పెట్టుకోని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పదవులు అమ్ముకున్న నీ చరిత్ర తెలువనోడు ఎవడన్నా ఉన్నడా అని రసమయిని ప్రశ్నించారు. నిరుపేదల జీవితాలను మెరుగుపరచెందుకు రేషన్ కార్డులు, ఇళ్ల పథకాల ప్రక్రియను ప్రారంభం దశలోనే రసమయి అడ్డుకోవడానికి తమ కార్యకర్తలకు పిలుపునివ్వడం దురుద్దేశపూరితంగా కనిపించదా అంటూ రమణారెడ్డి ప్రశ్నించారు.మొగిలిపాలెం గ్రామంలో నీ నాయకులు వేలకు వేలు లంచాలు తీసుకుంటే ఆ సమస్యను తానే పరిష్కరించానని దీనిని ఆధారాలతో బయటపెడతానని సవాల్ చేశారు. గత పదేళ్ళ బిఆర్ఎస్ పాలనలో ఒక్క గ్రామ సభను కూడా నిర్వహించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించే గ్రామ సభలకు ఎవరైనా అడ్డుపడితే ప్రజల హక్కుల మీద దాడి చేసినట్టేనని పేర్కొంటూ నియోజకవర్గంలోని నిర్వహించే గ్రామ సభలను విజయవంతం చేయడానికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. మీ అవినీతి, అక్రమాల చరిత్రను కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల రుద్దుతూ ఎమ్మెల్యే కవ్వంపల్లిపై విమర్శలు చేస్తే నియోజకవర్గంలో నుండి తరిమి తరిమి కొడతామని రసమయిని హెచ్చరించారు.కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస రావు, గోపు మల్లారెడ్డి, బండారి రమేశ్, రెడ్డిగాని రాజు, కొత్త తిరుపతిరెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, బూదారపు శ్రీనివాస్, ఎండీ హసన్, మార్క నర్సయ్య, పోలు రమేశ్, గోదారి శెట్టిబాబు, గొట్టిముక్కుల సంపత్ రెడ్డి,ఆషిఖ్ పాషా, పెంట వినోద్, ఎండీ రజాక్, తాళ్లపల్లి శ్రీనివాస్, అలువాల కుమార్, దుర్గాప్రసాద్, మాచర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.











