-మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్…
హుజురాబాద్/జనవరి 22 (మా అక్షరం): తెలంగాణ రాష్ట్రంలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు తోపాటు రేషన్ కార్డులు తప్పక అందుతాయని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, చైర్ పర్సన్ రాధికలు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలనలో భాగంగా బుధవారం హుజరాబాద్ లోని 19వార్డులో రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరణలో భాగంగా వారు మాట్లాడారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందుతాయని ఎవరు అధైర్య పడవద్దని అన్నారు. గతంలో రేషన్ కార్డుకు అభ్యర్థన పెట్టుకున్న వారిలో కొంతమందికి రాలేదని తెలుస్తుందని అన్నారు. గతంలో రానివారు మున్సిపల్ కార్యాలయంలోకి వచ్చి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు నిరంతర ప్రక్రియ ఉంటుందని,దీనిపై ఆందోళన అవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సొల్లు బాబు సునీత, కౌన్సిలర్ రాజు సతీమణి లక్ష్మి,19వ వార్డు కాంగ్రెస్ యూత్ నాయకులు గోస్కుల రాజ్ కుమార్ , మున్సిపల్ ఏ ఈ సాంబరాజు , వార్డ్ ఆఫీసర్ వెంకటరమణ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.











