-యుద్దభేరి మహాసభకు బిసిలు దండెత్తాలి
రానున్నది బీసీల రాజ్యమే..
– తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ దుస్స శివశంకర్..
పాలకుర్తి/ జనవరి 31 (మా అక్షరం): ఫిబ్రవరి 2న హనుమకొండ లోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంలో జరుగు బీసీ రాజకీయ యుద్ధభేరి మహాసభ విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ బిసి గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, నిరుద్యోగ జేఏసి కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో యుద్ధభేరి పోస్టర్లను ఆవిష్కరించి, నినాదాలు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ దుస్స శివశంకర్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం స్టేట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కూరపాటి రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్ లు మాట్లాడుతూ.. రాజకీయ యుద్ధభేరి మహాసభకు స్థానిక సంస్థల్లో 42 శాతం వాటా కోసం, బిసి బిడ్డల పొట్టకొడుతున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు కోసం, బీసీ కులాల రక్షణ కోసం బీసీ యాక్ట్ సాధన కోసం బిసిలందరూ దండెత్తి తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి నాయకులు చిలువేరు శంకర్, కాంగ్రెస్ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పులి గణేష్ గౌడ్,తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పెనుగొండ రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ డా” చందా మల్లయ్య, ముదిరాజ్ మహాసభ మండల ప్రధాన కార్యదర్శి మామిండ్ల లక్ష్మణ్, వడ్డెర సంఘం మండల అధ్యక్షులు బొమ్మిశెట్టి ఎల్లేష్, నాయీ బ్రాహ్మణ సంఘం మండల ఉపాధ్యక్షులు జంపాల కృష్ణ, పద్మశాలి సంఘ టౌన్ అధ్యక్షులు చిలకమారి వెంకటేశ్వర్లు,కాటబత్తిని రమేష్, పెనుగొండ వెంకటేశ్వర్లు, సమ్మయ్య, కామారపు సునీల్, చిలకమారి శ్రీధర్, ఎనగందుల శ్రీనివాస్, పెనుగొండ సోమశేఖర్,వల్లాల సునీల్, అంజి తదితర కులసంఘ నాయకులు పాల్గొన్నారు











