+91 99635 77856

నా ప్రాణం పోయినా… కెసిఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు!

హుజురాబాద్/ మార్చి 12 (మా అక్షరం): హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీని మారి కాంగ్రెస్ లో పార్టీలో చేరుతారన్న తప్పుడు ప్రచారాన్ని ఎమ్మెల్యే బుధవారం ఒక ప్రకటనలో ఘాటుగా స్పందించారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తూ… తాను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన తీవ్రంగా ఖండించారు. “బీఆర్ఎస్ నా కుటుంబం… కెసిఆర్ నా నాయకుడు. ఎప్పటికీ అదే పార్టీ, అదే నాయకుడి వెంట ఉంటానని, బీఆర్ఎస్ కి నాకు వున్న అనుబంధాన్ని ఎవరూ తెంచలేరని ధ్వజమెత్తారు.కొంతమంది నా ప్రజాదరణను చూసి ఓర్వలేక… కాంగ్రెస్ పార్టీకి వున్న చేతగాని పరిస్థితిని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి నీచమైన ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ నా రాజకీయం, నా నమ్మకం, నా జీవితం అంతా బీఆర్ఎస్ పార్టీకి అంకితం! అధికారంలో వున్నా, లేకపోయినా… నేను కెసిఆర్ గారితోనే ఉంటా!” అని స్పష్టం చేశారు.తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు, అలాగే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని హెచ్చరించారు. “బీఆర్ఎస్ కుటుంబ సభ్యులెవ్వరూ ఇలాంటి అబద్ధాలను నమ్మొద్దు. వీటిని ధీటుగా తిప్పికొట్టాలి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం!” అని కౌశిక్ రెడ్డి ధీమాగా చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !