హుజురాబాద్/మార్చి 20(మా అక్షరం): వ్యవసాయ యాంత్రికరణ ఉప పథకము( ఎస్ ఎం ఏ ఎం) కింద రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందించుటకు మహిళా రైతుల నుండి దరఖాస్తులు స్వికరిస్తున్నామని గురువారం హుజురాబాద్ సహాయ వ్యవసాయ సంచాలకులు సునీత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… 2024-25 ఆర్థిక సంవత్సరములో 50శాతము పై సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలు వచ్చాయాన్నారు. హుజురాబాద్ డివిజన్ పరిధిలో హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, విణవంక, సైదాపూర్ మండలాల్లో బ్యాటరీ స్ప్రేయర్స్-32, పవర్ స్ప్రేయర్స్ -32, రోటావేటర్స్ -20 మరియు (డిస్క్ హార్రోస్/కల్టివేటర్స్/MB ప్లవ్/కేజ్ వీల్స్)-22 పనిముట్లు రాయితీపై ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆసక్తి ,అర్హత గల రైతులు వెంటనే దరఖాస్తు పత్రముతో ఒక ఫోటో, కొత్త పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ జిరాక్స్ , ట్రాక్టర్ తో పని చేయు యంత్రాలకు ట్రాక్టర్ యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలు జత చేసి ఆయా మండల వ్యవసాయ కార్యాలయాల్లో ఇవ్వగలరని తెలిపారు.











