ఎల్కతుర్తి/మార్చి 20 (మా అక్షరం):
మండలంలోని వల్బాపూర్ గ్రామంలో గురువారం రోజున ఉదయం 8 గంటలకు పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పెన్నులు అందించిన శ్రీ పశుపతి నాథ స్వామి దేవాలయ అర్చకులు, ధూప దీప నైవేద్య సంఘం హనంకొండ జిల్లా కార్యదర్శి, ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీ సదా నిరంజన్ సిద్ధాంతి. అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణలు కావాలని ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్స్ కళ్యాణి, పద్మలత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Post Views: 102











