హుజూరాబాద్/ ఏప్రిల్09(మా అక్షరం): పట్టణంలోని స్థానిక శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో బుధవారం డిగ్రీ విద్యార్థులు ఫేర్వెల్ డే ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ…. జీవితంలో కష్టపడి చదివినప్పుడే ఉన్నత స్థాయికి వెళతామని, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలని ఉన్నత స్థాయిలో చూడాలని చాలా కష్టపడి చదివిపిస్తున్నారని, వాళ్ళ కష్టానికి తగినట్లు విద్యార్థులందరూ భవిష్యత్తులో మరింత పట్టుదలతో చదివి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉన్నత స్థానాలలో స్థిరపడి ప్రతిఫలంగా ఇవ్వాలని కోరడం జరిగింది. ప్రిన్సిపల్ ప్రవీణ్ రెడ్డి గారు మాట్లాడుతూ మన వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ, అనేక మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డ ఎందరో విద్యార్థిని విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని మీరు కూడా గొప్పగా చదివి కళాశాలకు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు అందరూ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని నృత్య ప్రదర్శనలు చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ బొక్కల ప్రవీణ్ రెడ్డి, కొలిపాక రమేష్, జల్ల సుధాకర్, వెంకటేష్, శ్రీనివాస్ తదితర అధ్యాపక బృందం తో పాటుగా విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.











