+91 99635 77856

పోతిరెడ్డిపేటలో ఘనంగా మహాత్మ జ్యోతిబా ఫూలే 199వ జయంతి

పోతిరెడ్డిపేట/ఏప్రిల్ 11(మా అక్షరం):పూలే కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పోతిరెడ్డిపేట గ్రామంలో మహాత్మ జ్యోతిబా ఫూలే 199వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ…బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిలో భాగంగా కుల వివక్ష, అంటరానితనంపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు జ్యోతిబా ఫూలే అని కొనియాడారు.ఫూలే గారు తమ జీవితాన్ని సామాజిక చైతన్యం, విద్యాభివృద్ధి కోసం అంకితం చేసి, అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి అయ్యారని చెప్పారు. ఆయన ఆశయాలను అర్ధం చేసుకుని, తదనుగుణంగా మనందరం బాధ్యతగా తరం తరానికి అందించాలని పిలుపునిచ్చారు. స్త్రీ విద్య కోసం కూడా ఆయన విశేషంగా కృషిచేశారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో సొల్లేటి మల్లారెడ్డి, మంతెన సురేందర్, నందిపేట పరమేశ్వర్, దేవునూరి కిరణ్ కుమార్, సందుపట్ల రాజేందర్, చెన్నోజు భద్రయ్య, గూళ్ళ శ్రీనివాస్, చెన్నోజు రమేష్, వెన్నంపల్లి శ్రీనివాస్, పోచంపల్లి సమ్మయ్య, కొండబోయిన సారయ్య, ఆకునూరి సుధాకర్, కాలేశ్వరం కార్తీక్, గాజుల సమ్మయ్య, కాలేశ్వరం బాబు, ఎడ్ల కుమార్, కాటిక సంపత్, గాజుల అశోక్, దేవునూరి చెన్నయ్య, ఎలుకపల్లి మనీ, రఘునాథ్, దేవునూరి శ్రీనివాస్, కలకోట సుధీర్, చొప్పరి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !