హుజూరాబాద్/ఏప్రిల్11 (మా అక్షరం): పట్టణంలోని సూపర్ బజార్ రోడ్డులో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పూలే జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఇప్పలపెల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, బండ శ్రీనివాస్, గందె రాధిక, వడ్లూరి విజయ్ కుమార్, కొలిపాక శంకర్, మారెపెల్లి శ్రీనివాస్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.పూలే దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ..అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. స్త్రీ విద్యా విప్లవానికి ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. మొదటి బాలికల పాఠశాల స్థాపించి, వితంతు వివాహాలు, వయోజన విద్యకు శ్రీకారం చుట్టిన తొలి సంఘసంస్కర్తగా ఆయనకు గుర్తింపు వచ్చిందన్నారు.ఈ సందర్భంగా పలువురు సంఘ నాయకులు, కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పూలే ఆశయాలను నెరవేర్చడం మన బాధ్యతగా పేర్కొంటూ, సమానత్వ సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పూలే జయంతి ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు సందెల్ల వెంకన్న, చందుపట్ల జనార్ధన్, ముప్పు శ్రీనివాస్, ఆలేటి రవీందర్, ఎర్రబోజు నారాయణ, ప్రధాన కార్యదర్శి తులసీ లక్ష్మణమూర్తి, ప్రజాల సంఘాల నాయకులు వేల్పుల రత్నం, రుద్రారపు రాంచంద్రం, ఖాలీద్ హుస్సేన్, సమ్మయ్య ముదిరాజ్, వేముల పుష్పలత, సొల్లు బాబు, మూల సాయి, మార్త రవీందర్, కే ఆర్ బిక్షపతి, చిలుక మారి శ్రీనివాస్, మధుకర్, ఎర్ర శ్రీధర్, ఎర్ర నాగరాజు, మాచర్ల నరేష్, మిడిదొడ్డి రాజు, శ్రీనివాస్ , ఇప్పకాయల సాగర్, అమరేందర్ గౌడ్, రాంశంకర్ గౌడ్, బుర్ర కుమార్ గౌడ్, సొల్లు సునీత, చీకోటి వెంకట రమణ, రాంరాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.











