+91 99635 77856

మహానేతకు విగ్రహం.. శుభపరిణామం

Kudikala Sai Editor
maaksharamnews.in

మహానేతకు విగ్రహం.. శుభపరిణామం

– వొడితల ప్రణవ్ బాబు...
హుజురాబాద్/ఏప్రిల్‌ 12(మా అక్షరం): మహానీయుల విగ్రహాల ఏర్పాటు శుభపరిణామమని, భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్‌ హుజురాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌ బాబు అభిప్రాయపడ్డారు. హుజురాబాద్‌కు చెందిన పీవీ సేవా సమితి, అలయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు శనివారం హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం హుజరాబాద్ లోని సైదాపూర్‌ X రోడ్డు వద్ద దివంగత ప్రధాని పీవీ నరసింహరావు విగ్రహ ఏర్పాటుపై ఆయనకు వినతి అందజేశారు.ఈ సందర్భంగా ప్రణవ్‌ బాబు మాట్లాడుతూ.. సమాజానికి గొప్ప సేవలందించిన మహానేతల్లో పీవీ ముందుండారన్నారు. ఆయన తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ అభివృద్ధికి దోహదపడ్డాయని గుర్తుచేశారు. మహనీయుల విగ్రహాలు భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. విగ్రహ ఏర్పాటుకు పూర్తి మద్దతు అందిస్తామన్నారు. ఈ మేరకు ముందుకొచ్చిన సంస్థలను అభినందించారు.పీవీ సేవా సమితి అధ్యక్షుడు తూము వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే పీవీ జయంతి నాటికి విగ్రహ ఏర్పాటును పూర్తి చేసి అభిమానుల సమక్షంలో ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు తోట రాజేంద్రప్రసాద్‌, అలయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు బి.మనోజ్‌ పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

– వొడితల ప్రణవ్ బాబు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !