+91 99635 77856

మెగా వైద్య శిబిరానికి భారీ స్పందన

-24 గంటల వైద్య సేవలు అందించడానికి సిద్ధం
-శ్రీరామ ఆసుపత్రి డాక్టర్ శ్రీకర్…

హుజురాబాద్/ఏప్రిల్ 12 (మా అక్షరం): పట్టణం లోని శ్రీరామ హాస్పిటల్ లో శనివారం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి భారీ స్పందన వచ్చింది. శ్రీరామ హాస్పిటల్ హుజురాబాద్, ఆర్కే హాస్పిటల్ కరీంనగర్, శరత్ మాక్స్ విజన్ హనుమకొండ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ శిబిరంలో భారీ సంఖ్యలో వచ్చిన జనాలకు వివిధ రకాల టెస్టులు నిర్వహించారు. అందులో భాగంగా 58 రకాల ఐదువేల విలువగల టెస్టులను కేవలం 999కి నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ ఆసుపత్రి డాక్టర్ శ్రీకర్, ఆర్కే ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్లు మాట్లాడుతూ… ప్రజలు రోగాల పట్ల చాలా జాగ్రత్త వహించాలని అన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అలాగే వివిధ రకాల టెస్టులను కేవలం 999 కీ అతి తక్కువ ఖర్చుతో నిర్వహించడం జరిగిందని అన్నారు. మానవ శరీరంలోని ప్రతి అవయవం ముఖ్యమేనని, సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే వైద్య పరీక్షలు చేయించుకొని మందులు వాడితే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని అన్నారు. శ్రీరామ హాస్పిటల్ లో ఇకనుంచి 24 గంటల వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని, ఎవరికి ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు వైద్య నిపుణులు డాక్టర్ స్వామి రావు, డాక్టర్ రాజేష్, శ్రీరామ హాస్పిటల్ నిర్వాహకులు నంబి భరణి కుమార్ , ముష్కే శ్రీనివాస్, శరత్ మాక్స్ విజన్ కోఆర్డినేటర్ సతీష్ కౌన్సిలర్ ఆస్తమాలజిస్ట్ నవీన్, ఆసుపత్రి సిబ్బంది పూరి, తిరుపతి, దీపిక, సునీత, సతీష్, నిఖిల్, సంధ్య, సాయి కృష్ణ తోపాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !