+91 99635 77856

దళిత బంధు లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

దళిత బంధు లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలి

-కరీంనగర్ కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి...
హుజురాబాద్/ మే 13 (మా అక్షరం):
నియోజకవర్గంలో దళిత బంధు పథకం కింద మంజూరైనప్పటికీ ఇంకా విడుదల కాని నిధులను తక్షణమే విడుదల చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. మంగళవారం కరీంనగర్ కలెక్టర్‌ను కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...హుజురాబాద్‌లో దళిత బంధు లబ్ధిదారులుగా ఎంపికైన 18,000 మందిలో ఇప్పటివరకు 13,000 మందికి నిధులు విడుదల అయ్యాయని, మిగిలిన 5,000 మందికి నిధులు ఖాతాల్లో జమ అయినా, వాటిని ఫ్రీజ్ చేయడం వల్ల వారు యూనిట్లను అమలు చేయలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వం ఇప్పటికే నిధుల విడుదలకు అనుమతి ఇచ్చినా, కార్యాచరణలో ముందడుగు పడలేదన్నారు. ప్రజల ఆశలపై నీళ్లు చల్లకూడదని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బండ శ్రీనివాస్, పావని వెంకటేశ్, మొలుగు దిలీప్, నాగి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

 

Share ePaper Clip

Preparing image...

-కరీంనగర్ కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి…
హుజురాబాద్/ మే 13 (మా అక్షరం):
నియోజకవర్గంలో దళిత బంధు పథకం కింద మంజూరైనప్పటికీ ఇంకా విడుదల కాని నిధులను తక్షణమే విడుదల చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. మంగళవారం కరీంనగర్ కలెక్టర్‌ను కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…హుజురాబాద్‌లో దళిత బంధు లబ్ధిదారులుగా ఎంపికైన 18,000 మందిలో ఇప్పటివరకు 13,000 మందికి నిధులు విడుదల అయ్యాయని, మిగిలిన 5,000 మందికి నిధులు ఖాతాల్లో జమ అయినా, వాటిని ఫ్రీజ్ చేయడం వల్ల వారు యూనిట్లను అమలు చేయలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వం ఇప్పటికే నిధుల విడుదలకు అనుమతి ఇచ్చినా, కార్యాచరణలో ముందడుగు పడలేదన్నారు. ప్రజల ఆశలపై నీళ్లు చల్లకూడదని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బండ శ్రీనివాస్, పావని వెంకటేశ్, మొలుగు దిలీప్, నాగి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !